NTV Telugu Site icon

RC16 : రామ్ చరణ్ 16 కోసం న్యూలుక్ లో జగ్గుభాయ్.. వీడియో వైరల్

Rc 16

Rc 16

గేమ్ ఛేంజర్ సంక్రాంతికి రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ముగించిన రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా  RC 16 ను సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఉప్పెన వంటి సూపర్ హిట్ సినిమా అందించిన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను  తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read : Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మరో పాన్ ఇండియా మూవీ

కాగా ఈ సినిమాలో టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా RC16 లోని తన పాత్రకు సంబందించి లుక్ మేకింగ్ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ‘చాలా కాలం తర్వాత బుచ్చి బాబుసన RC 16 కోసం మంచి పనిపెట్టాడు. ఈ సినిమాలో నా గెటప్ చూసిన తర్వాత చాలా తృప్తిగా ఉందని ట్వీట్ చేసాడు జగ్గు భాయ్. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఆ మధ్య కర్ణాటక లోని మైసూరులో ఫినిష్ చేసాడు దర్శకుడు బుచ్చి బాబు. దాదాపు 15 రోజులు పాటు కీలక సన్నివేశాలను షూట్  చేసారు. ఇక రెండవ షెడ్యూల్ ను  హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొంత భాగం చిత్రీకరించనునున్నారు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌, వృద్ధి సినిమాస్ తో కలిసి మైత్రీ మూవీస్ బ్యానర్‌పై ఆర్‌సి 16 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Show comments