NTV Telugu Site icon

Jagapathibabu : రోడ్డుపై సామాన్యుడిలా నడుచుకుంటూ వెళ్లిన జగపతిబాబు..

Jagapathibabu

Jagapathibabu

Jagapathibabu : విలక్షణ నటుడు జగపతి బాబుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వ్యవహరించే తీరుకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో హీరో నుంచి ఇప్పుడు విలన్ పాత్రల దాకా అన్నీ పోషిస్తున్నారు. సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ పాత్రలు అంటే అందరికీ జగపతి బాబే గుర్తుకు వస్తున్నాడు. ఆ స్థాయిలో ఆయన నటిస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో తన లైఫ్ కు సంబంధించిన అనేక విషయాలను ఆయన పంచుకుంటారు. మొన్న ఉగాది రోజు తన తల్లి ఇంటికి వెళ్లి స్వయంగా వెళ్లి వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలారు. దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో వీడియోను పంచుకున్నారు.

Read Also : Vishwambhara vs Mass Jathara : చిరంజీవి వర్సెస్ రవితేజ.. బాక్సాఫీస్ క్లాష్ తప్పదా..?

ఇందులో ఆయన వీధుల్లో సామాన్యుడిలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఓ షాపులో మొబైల్ కొనేందుకు ఆయన ఇలా నడుచుకుంటూ ట్రాఫిక్ మధ్యలో నుంచి వెళ్తున్నారు. ఇదంతా ఆయన వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘నా లైఫ్ బ్లాక్ అండ్ వైట్ లోకి’ అంటూ ఆయన రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన్ను రోడ్డుపై వెళ్లే వారు ఎవరూ గుర్తు పట్టినట్టు అనిపించలేదు. లేదంటే ట్రాఫిక్ జామ్ అయిపోయేదేమో. ఇక జగపతి బాబు ఇంత సింపుల్ గా ఉంటారా అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు.