NTV Telugu Site icon

Jagapathi Babu: ఎంత ఎదవలాగా చేస్తే అన్ని అవార్డులు.. జగపతిబాబు సంచలనం

Jagapathi Babu

Jagapathi Babu

అవార్డుల గురించి నటుడు జగపతి బాబు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత పవర్ఫుల్ విలన్ పాత్రలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే కేవలం తెలుగు సినిమాల్లోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో సైతం పవర్ఫుల్ విలన్ గా అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం దుబాయ్ లో జరిగిన ఐఫా 2024 అవార్డుల కార్యక్రమంలో ఆయనకు బెస్ట్ విలన్ అవార్డు లభించింది. కన్నడ నాట సూపర్ హిట్గా నిలిచిన దర్శన్ కాటేరా సినిమాలో జగపతిబాబు విలన్ పాత్రలో నటించాడు. ఆ సినిమాకు గాను ఆయనకు బెస్ట్ పర్ఫామెన్స్ ఇన్ నెగిటివ్ రోల్ అవార్డు లభించింది.

Anil Ravipudi: దిల్ రాజుపై పంతం నెగ్గించుకున్న అనిల్ రావిపూడి?

ఈ అవార్డు అందుకునేందుకు దుబాయ్ వెళ్లిన ఆయన అక్కడ రికార్డు చేసిన ఒక వీడియోను షేర్ చేస్తూ ఎంత ఎదవ లాగా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి అంటూ సరదాగా కామెంట్ చేశాడు. కానీ దాని వెనుక ఏదో పెద్ద కారణమే ఉందా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. అవార్డులు మీద ఆయనకు సరైన అభిప్రాయం లేకపోవడంతోనే అలా కామెంట్ చేసి ఉండవచ్చని కొందరు కామెంట్ చేస్తుంటే అవార్డుల మీద సరైన అభిప్రాయం లేకపోతే ఆ దుబాయ్ వరకు అయినా ఎందుకు వెళ్లారు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.

Show comments