Jagapathi Babu: మళ్లీ హీరోగా రావాలన్న ఆఫర్.. ఒక్క మాటతో షాక్ ఇచ్చిన బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagapathi Babu: తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన జగపతి బాబు, ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ‘గాయం’, ‘మావిచిగురు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘అల్లరి ప్రేమికుడు’ వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకులు మంచి ఆదరణ చూపించారు. ఫ్యామిలీ, యాక్షన్, ఎమోషనల్ డ్రామాలు ఇలా ప్రతి జానర్లోనూ తనదైన ముద్ర వేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే స్టార్డమ్ కూడా క్షణాల్లో కరిగిపోతుంది. కానీ ఆ విషయంలో జగపతి బాబు మాత్రం ఇప్పుడు ఒక అడుగు ముందే ఆలోచిస్తున్నారు. హీరోగా అగ్రస్థానాన్ని చూసిన ఆయన, అవకాశాలు లేని సమయంలో తనను తాను మార్చుకుని విలన్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించడం ఆయన కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ ఒక్క సినిమా ఆయనకు కొత్త గుర్తింపును తీసుకురావడమే కాకుండా, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస అవకాశాలను తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం జగపతి బాబు కెరీర్ అత్యంత బిజీ దశలో ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ చేతినిండా ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. విలన్‌గా, పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయనకు ఉన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఓ ప్రముఖ దర్శక నిర్మాత ఆయనను మరోసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో కొత్త కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ కథను స్వయంగా జగపతి బాబుకు వినిపించి, హీరోగా నటించాలని కోరినప్పటికీ ఆయన ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ప్రస్తుతం తనకు ఉన్న ఇమేజ్, ప్రేక్షకుల్లో ఏర్పడిన అంచనాలు, పరిశ్రమలో కొనసాగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మళ్లీ హీరోగా ప్రయోగాలు చేయడం సరైన నిర్ణయం కాదని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోతే ప్రస్తుతం ఎంతో కష్టపడి సంపాదించుకున్న విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇమేజ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందనే ఆలోచనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
స్టార్డమ్ కోసం కాకుండా, ఇండస్ట్రీలో లాంగ్ జర్నీని దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘నాగబంధం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, మరోవైపు పలు భాషల్లో రూపొందుతున్న భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. హీరోగా కాకపోయినా, తన నటనతో ప్రతి పాత్రను హీరో స్థాయికి తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న నటుడిగా జగపతి బాబు మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.
- Tags
- cinema
- Jagapathi Babu
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!