Site icon NTV Telugu

RGV – Sandeep Reddy : ఆర్జీవీ ఒక సైతాన్.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్

Jagapathibabu

Jagapathibabu

RGV – Sandeep Reddy : సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఫైర్ కనిపిస్తుంది. అలాంటి మైండ్ సెట్ తోనే ఉండే సందీప్ రెడ్డి వంగా తోడైతా ఇంకెలా ఉంటుందో కదా. వీరిద్దరూ ఒకే టాక్ షోకు వస్తే కథ వేరేలా ఉంటుంది. దాన్ని ఇప్పుడు నిజం చేసి చూపించాడు జగపతిబాబు. ఆయన హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయంబురా టాక్ షోకు వీరిద్దరూ తాజాగా గెస్ట్ లుగా వచ్చారు. ఇందులో జగపతి బాబు ముందుగా ఆర్జీవీని పిలిచారు. వస్తూనే ఆర్జీవీ ఎనర్జిటిక్ గా కనిపించాడు. అందరికీ తను ఆర్జీవీ అయితే నాకు మాత్రం సైతాన్ అంటూ బాంబు పేల్చాడు జగపతిబాబు. ఆయన మాటలకు ఆర్జీవీ కూడా నవ్వుకున్నాడు. ప్రేక్షకుల కోసం సినిమా ఎప్పుడు తీస్తావ్ అని జగపతి బాబు అడగ్గా.. నా లైఫ్‌ లో నేను నేర్చుకుంది ఒక్కటే.. ఏం చెప్పినా ఎవడూ వినడు అని ఆన్సర్ ఇచ్చాడు ఆర్జీవీ.

Read Also : NTR-NEEL : ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో హీరోయిన్ ఫిక్స్..

నీతో పది నిముషాలు కూర్చుంటే నీలాగే మారిపోయేలా ఉన్నాను అన్నాడు జగపతిబాబు. ఆ తర్వాత సందీప్ రెడ్డిని కూడా షోకు పిలిచారు. సందీప్ కు వోడ్కా బాటిల్ గిఫ్ట్ గా ఇచ్చాడు జగపతిబాబు. దానికి ఆర్జీవీ.. నాకెందుకు ఇవ్వలేదు. అంటే సందీప్ పెద్ద డైరెక్టర్ నేను కాదు అని ఇవ్వలేదా అని పంచ్ వేశాడు. మీ ఇద్దరినీ చూస్తుంటే ఒక డెవిల్, ఒక యానిమల్ ను ఒకే ఫ్రేమ్ లో చూస్తున్నట్టు ఉందన్నాడు జగ్గూభాయ్. మనం ఇద్దరం క్లాస్ మేట్స్ అయితే ఎలా ఉంటుంది అన్నాడు సందీప్. మనం ఇద్దరం క్లాస్ మేట్స్ అయితే ఎవరో ఒకరు అమ్మాయిగా పుట్టాలి అని ఆర్జీవీ అనడంతో అంతా నవ్వేశారు. ఇలా ఇంటర్వ్యూ ప్రోమో మొత్తం ఫన్ గా సాగిపోయింది. త్వరలోనే దీని ఫుల్ ఎపిసోడ్ ను రిలీజ్ చేయబోతున్నారు. మొత్తానికి మంచి ప్రశ్నలు వేస్తూ జగపతిబాబు టాక్ షోను ఎనర్జిటిక్ గా మార్చేస్తున్నాడు.

Read Also : Mahavatar Narsimha : ఆస్తులన్నీ అమ్ముకున్నా.. మహావతార్ డైరెక్టర్ కష్టాలు

Exit mobile version