NTV Telugu Site icon

Comedian Ali: బిగ్ బ్రేకింగ్.. ఆలీకి కీలక పదవి కట్టబెట్టిన జగన్

Ali

Ali

Comedian Ali: ఏపీ రాజకీయాలు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతున్నాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీలో ఎప్పటినుంచో యాక్టివ్ గా ఉంటున్న కమెడియన్ ఆలీకి కీలక పదవిని అందించారు. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఆలీని నియమించినట్లు జగన్ అధికారికంగా ప్రకటించారు. ఇక తనకు జగన్ అప్పజెప్పిన పనులను నియమ నిబంధలతో నిర్వర్తిస్తానని ఆలీ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత కొన్నిరోజుల నుంచి ఆలీ వైసీపీ పార్టీ వీడనున్నట్లు వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. అయితే వాటిలో నిజం లేదని, తను ఎప్పుడు జగన్ పార్టీలోనే ఉంటానని ఆలీ ఖరాకండీగా చెప్పేశాడు. తనకు పదవులు అవసరం లేదని, జగన్ మనసులో స్థానం ఉంటే చాలని ఆలీ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా ఆలీకి సరైన పదవిని జగన్ అప్పగించారని పలువురు నేతలు చెప్పుకొస్తున్నారు.

Show comments