Site icon NTV Telugu

ఆకట్టుకుంటోన్న ధనుష్ ‘జగమే తందిరం’ ట్రైలర్

తమిళ స్టార్ నటుడు ధనుష్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్ తెర‌కెక్కిస్తోన్న‌ చిత్రం ‘జగమే తందిరం’. ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని వై నాట్‌ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. తాజాగా ‘జగమే తందిరం’ ట్రైల‌ర్‌ విడుదల చేసింది చిత్రబృందం. గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో ధ‌నుష్ మాస్ లుక్‌లో అద‌ర‌గొట్టాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ నటుడు జేమ్స్ కాస్మో, సంచన నటరాజన్, జోజు జార్జ్, కలైరసన్, వడివక్కరసి కీలకపాత్రల్లో నటించారు. కాగా ఓటీటీ వేదిక‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు సిద్ధ‌వుతోంది. జూన్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. గత ఏడాది థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం థియేటర్ల మూసివేత కారణంగా ఓటీటీలో విడుదలవుతుంది.

Exit mobile version