NTV Telugu Site icon

Jabardasth Vinod: జబర్దస్త్ వినోద్ కు చేతబడి.. వామ్మో ఇలా అయ్యాడేంటి?

Jabardasth Vinod Black Magic

Jabardasth Vinod Black Magic

Jabardasth Vinod about Black Magic: జబర్దస్త్ కార్యక్రమం ఫాలో అయ్యే వారందరికీ వినోద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద వినోదినిగా లేడీ గెటప్ ధరించి అభిమానులందరినీ అలరిస్తూ ఉంటాడు వినోద్. ముఖ్యంగా ఇప్పుడైతే జబర్దస్త్ లో అమ్మాయిలే అలరిస్తున్నారు కానీ ఒకప్పుడు లేడీ గెటప్ ధరించి అబ్బాయిలే అమ్మాయిల పాత్రలు కూడా చేయాల్సి వచ్చేది. అలాంటి సమయంలో చమ్మక్ చంద్రతో కలిసి వినోద్ చేసిన అల్లరి అంతా కాదు. నిజంగా అమ్మాయిలే కుళ్ళుకునేలా అందంగా తయారై జబర్దస్త్ ద్వారా అనేక మంది అభిమానులను సంపాదించుకున్న వినోద్ ఆ మధ్య ఇంటి ఓనర్ తో గొడవపడి కేసుల వరకు వెళ్లి వార్తలకి ఎక్కాడు. ఆ తర్వాత ఆ విషయం నుంచి బయటపడి వివాహం చేసుకుని ఒక ఇంటి వాడు కూడా అయ్యాడు. ఒకపక్క యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ మరోపక్క జబర్దస్త్ ద్వారా బాగానే ఉన్నాడనుకుంటున్న సమయంలో అనారోగ్యానికి గురైయ్యాడు.

Tiger 3: ఇమ్రాన్‌ హష్మీతో అలా నటించిన ఫస్ట్‌ నటి నువ్వే.. నెటిజన్‌ పోస్ట్‌పై రిద్ధి రియాక్షన్‌

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను అనారోగ్యానికి గురైన వ్యవహారం గురించి చెబుతూ తన మీద చేతబడి చేశారేమో అని అనుమానం కూడా వ్యక్తం చేశాడు. తనకు హాస్పిటల్కి చేతబడి విరుగుడు పూజలకు కలిపి దాదాపు 3 లక్షల వరకు ఖర్చయిందని ఆయన చెప్పుకొచ్చారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని తన సహనటులు చాలామంది సహాయం చేశారని తాను ఎవరిని సహాయం అడగకపోయినా వారాంతటి వారే ముందుకు వచ్చి సహాయం చేయడం చాలా ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చాడు. ఇంటి ఓనర్ తో గొడవ అయినప్పుడు చేయి విరిగిందని చెప్పుకొచ్చిన ఆయన ఒక విషయంలో హామీ ఉండటంతో ఐదు లక్షల నష్టపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి ఆరోగ్యం కుదుటపడుతోందని అంతా సెట్ అయిన తర్వాత జబర్దస్త్ తో పాటు ఈవెంట్స్ కూడా చేసుకుంటానని చెబుతున్నాడు. మొత్తం మీద తన మీద ఎవరో చేతబడి చేశారంటూ వినోద్ చేసిన కామెంట్లు మాత్రమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show comments