Site icon NTV Telugu

Jabardasth Varsha: ఇమ్మానియేల్ తో పెళ్లి.. మీకెందుకు చెప్పాలి

Varsha

Varsha

Jabardasth Varsha: జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన లేడీ కమెడియన్స్ వర్ష ఒకరు. సీరియల్స్ లో చిన్న చిన్న రోల్స్ చేసుకొనే ఆమె .. జబర్దస్త్ కు వచ్చి.. ఇమ్మాన్యుయేల్ తో ప్రేమాయణం నడిపి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇంకోపక్క నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. ఇక సుధీర్- రష్మీ జంట తరువాత అంతగా ఫేమస్ అయ్యింది ఈ జంటనే.. ఇమ్ము.. అత్తమ్మకు చెప్పు కోడలు వస్తుంది అన్న డైలాగ్ తో ఈ జంట ఫేమస్ అయ్యారు. ఇక అప్పటినుంచి వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. వీరు కూడా ఆ వార్తలను ఖండించలేదు కాబట్టి.. త్వరలోనే ఇమ్ము- వర్ష పెళ్లి చేసుకుంటున్నారని అభిమానులు కూడా ఫిక్స్ ఐపోయారు.

తాజాగా వర్ష.. తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. ఇమ్మూతో పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు వర్ష మాట్లాడుతూ. ” ఇమ్ము మీద నాకు మంచి ఒపీనియనే ఉంది. నాకు,అతనికి పెళ్లి ఎప్పుడు అనేది మా పర్సనల్ విషయం కదా.. మీకెందుకు చెప్పాలి. ఒకవేళ అయితే చూడండి. అవ్వకపోయినా చూడండి. అలా అని కాదు. అతనిపై నాకు మంచి అభిప్రాయం ఉంది అని మాత్రమే చెప్పగలను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి సుధీర్- రష్మీ లా.. వీరు కూడా ఆన్ స్క్రీన్ రొమాన్స్ అంటారో.. ఆఫ్ స్క్రీన్ లో పెళ్లి చేసుకుంటారో చూడాలి.

Exit mobile version