NTV Telugu Site icon

Jabardasth Faima: పట్టుపట్టి సాధించింది.. తలెత్తుకునేలా చేసిన జబర్ధస్త్ ఫైమా

Jabardasth Faima New House

Jabardasth Faima New House

Jabardasth Faima New House Warming Ceremony Video Viral: జబర్దస్త్ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. చాలా మందికి సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. ఇక ముందుగా ఈ షోలో లేడీస్ ఉండేవారు కాదు. మగవారి చేతనే ఆడవారి గెటప్పులు వేసి పని కానిచ్చేవారు కానీ తరువాత లేడీస్ కూడా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ షోలో పటాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఫైమా కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్హి మరింత ఫేమస్ అయింది. ఆమె బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు తన చిరకాల కోరిక బయట పెట్టింది. కడు పేదరికం నుంచి తాను ఇక్కడిదాకా వచ్చానని వెల్లడించిన ఆమె సొంతిల్లు కట్టుకోవడమే తన జీవిత లక్ష్యం అని వెల్లడించింది. ఇక ఆమె ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. ఈ విష‌యాన్ని త‌న యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా ఆమె వెల్లడించింది.

Nidhi Agarwal : సైమా ఈవెంట్ లో స్టన్నింగ్ లుక్ లో మెరిసిన ఇస్మార్ట్ బ్యూటీ..

త‌న చిరకాల కల నెరవేరిందని, తాజాగా కొత్తింటిల్లోకి అడుగు పెట్టామని చెపుతూ తన గృహప్రవేశం వీడియోను తన యూట్యూబ్ చానల్ లో పంచుకుంది. గృహప్రవేశంలో ఆమెతోటి కామెడీ స్టార్స్ కూడా సందడి చేశారు. ఫైమాతో పాటు జబర్దస్త్ కమెడియన్లు కూడా ఈ ఈవెంట్ లో హడావిడి చేశారు. ఈ సందర్భంగా ఫైమా తన త‌ల్లిని పట్టుకుని క‌న్నీళ్లు పెట్టుకుంది. ఫైమా కొత్తింటి గృహ ప్ర‌వేశ కార్య‌క్ర‌మానికి జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్, బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే సూర్య సహాయ అనేక మంది హాజరయ్యారు. ఇక ఇదిలా ఉంటే పేద కుటుంబం నుంచి వచ్చి పటాస్ షో ద్వారా ముందుకొచ్చి జబర్దస్త్ కామెడీ షో వల్ల స్టార్ అయింది ఆమె.అందంగా లేకపోయినా ఆమె తనదైన పంచులతో కామెడీ టైమింగ్స్ తో క్రేజ్ సంపాదించింది.

Show comments