యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న చిత్రం వార్ 2. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ నిమిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ను టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ కొనుగోలు చేసారు. ఈ విషయాన్నీ అధికారకంగా ప్రకటిస్తూ వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. దాదాపు రూ. 90 కోట్లకు ఈ డీల్ క్లోజ్ అయిందని సమాచారం. డబ్బింగ్ సినిమాలలోనే అత్యధిక పలికిన సినిమాగా వార్ 2 నిలిచింది. అరవింద సమెత వీర రాఘవ, దేవర తర్వాత నాగవంశీ ఎన్టీఆర్ కాంబోలో రిలీజ్ అవుతున్నమూడవ సినిమా వార్ 2. అయితే వార్ 2 కు అంత ధర పలికిందంటే అందుకు కారణం ఎన్టీఆర్ అనే చెప్పాలి. కాగా వార్ 2 తెలుగు రిలీజ్ కు నాగవంశీ భారీ ప్లానింగ్ చేస్తున్నాడు. దేవరకు ఎలా అయితే తెల్లవారు జామున షోస్ భారీ ఎత్తున వేసారో వార్ 2 కుడా అదే ప్లానింగ్ చేస్తున్నారు సమాచారం. ఏదేమైన తెలుగు స్టేట్స్ లో వార్ 2 రిలీజ్ ఊహించిన దానికంటే భారీగా ఉండబోతుందనడంలో సందేహం లేదు.
Also Read : Nithiin : ‘తమ్ముడు’ని నమ్ముకుని నిండా మునిగిన హీరోయిన్
