NTV Telugu Site icon

Vishnu: మా ఫ్యామిలి గొడవలకు త్వరగా ఫుల్‌స్టాప్‌ పడితే బాగుండు: మంచు విష్ణు

February 7 2025 02 24t074445.086

February 7 2025 02 24t074445.086

టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాల్లో ‘కన్నప్ప’ ఒకటి. ఈ మూవీ కోసం విష్ణు ఎంతో కష్టపడుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ మూవీ పై అంచనాలు పెంచగా.. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి  అగ్ర నటీనటులతో పాటుగా..

Also Read:Kangana Ranaut: బాలీవుడ్‌ పై మరోసారి విమర్శలు కురిపించిన కంగనా రనౌత్ ..!

మోహన్ బాబుతో పాటు కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, బ్రహ్మానందం, సప్తగిరి రఘు బాబు, ఐశ్వర్య రాజేష్, దేవరాజ్ తో పాటుగా మొట్టమొదటి సారిగా విష్ణు కూతుళ్లు మంచు అవ్రామ్, అర్పిత్ రంకా కూడా ఈ మూవీలో భాగం కాబోతున్నారు. ఇక ఇంత భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్‌ 25న విడుదల కానుంది. ఇక దీంతో విష్ణు అని విధాలుగా ఈ మూవీ కోసం ప్రమోషన్ చేస్తున్నాడు..

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన విష్ణు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. విష్ణు మాట్లాడుతూ.. ‘నా ఎదుట శివుడి ప్రత్యక్షమై వరమిస్తానంటే.. ఎన్ని జన్మలెత్తినా నాకు తండ్రిగా మోహన్‌బాబునే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. నేను మా అమ్మానాన్నతో ఉండాలి. నా పిల్లలు అలాంటి కుటుంబ వాతావరణంలో పెరగాలనేదే నా కోరిక. మా కుటుంబంలోని కలహాలు, గొడవలకు త్వరగా ఫుల్‌స్టాప్‌ పడితే బాగుండనిపిస్తోంది’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీలో మనోజ్ తో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది.. వారు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. దీని ఉద్దేశించే విష్టు అసంతృప్తి వ్యక్తం చేశారు.