పచ్చని పొలాలు… పట్టు చీరలు కట్టిన ఆడపడుచులు. పసిపిల్లల నవ్వులు, పరవళ్లు తొక్కే చెరువులు… ఇవి మన పల్లె వాతావరణానికి చిహ్నాలు. కానీ ఇప్పటి టాలీవుడ్ పల్లె కథలు. కేవలం అందాల్ని కాదు, అంతర్లీన భావోద్వేగాల్ని తెరపైకి తీసుకొస్తున్నాయ్.టాలీవుడ్ లో ఇప్పుడు పల్లెటూరి ఫీవర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సమంత, రానా దగ్గుబాటి, కీర్తి సురేష్, కిరణ్ అబ్బవరం లాంటి నటులు ఇప్పుడు గ్రామీణ కథలతో, ఆ నేటివ్ ఫీలింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నారు. సమంత నిర్మించిన ఫస్ట్ మూవీ ‘శుభం’ హారర్ కామెడీ అయినప్పటికీ, గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌తో సరళమైన కథను చూపించి లాభాల్లో నిలిచింది. ఈ సక్సెస్ ఇలాంటి కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే హోప్ ను పెంచేసింది.
Also Read : HHVM : హరిహర రిలీజ్ చిక్కులు.. చక్రం తిప్పిన ముగ్గురు నిర్మాతలు
రానా దగ్గుబాటి ఇప్పటికే C/o కంచరపాలెం సినిమాను నిర్మించి సక్సెస్ అయ్యాడు. అదే కోవలో ఇప్పుడు ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే చిత్రంపై ఆశలు పెట్టుకున్నాడు. పల్లెబాటలో ఓ విభిన్న కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. ఇక కీర్తి సురేష్ నటించిన ‘ఉప్పు కప్పురంబు’ రూరల్ బ్యాక్‌డ్రాప్ అయినా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అంటే, అన్ని గ్రామీణ కథలూ సక్సెస్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. కాని, ఎక్కువ శాతం ఆడియన్స్ లైఫ్ లో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ జ్ఞాపకాలు ఉంటాయి అందుకే సక్సెస్ రేట్ కాస్త ఎక్కువ. ఇక కిరణ్ అబ్బవరం కొత్తగా చేస్తున్న ‘తిమ్మరాజు పల్లి TV’ కూడా గ్రామీణ నేపథ్య కథే. ఓ డెబ్యూట్ డైరెక్టర్, కొత్త నటులతో రూపొందుతున్న ఈ సినిమా పల్లె టూరిలో ప్రేమను బలంగా చూపిస్తోంది. ఇలా టాలీవుడ్ పల్లెబాట పడుతుండడం ఒక మంచి పరిణామం అనే చెప్పాలి.
