IT Raids: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఆఫీస్ లో ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. నేటి ఉదయం సారధి స్టూడియోలో ఉన్న నాగవంశీ వద్దకు ఐటీ అధికారులు వచ్చి, ఆయనను తీసుకొని వెళ్లి అతని ఇంట్లో, ఆఫీస్ లో దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఇక మరోపక్క హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ఆఫీస్ లో కూడా ఐటీ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. సితార, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ను ఎస్, రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి చూసుకుంటున్నారు. వీరు.. రియల్ ఎస్టేట్స్ లో పెట్టుబడులు పెట్టినట్లు అనుమానాలు ఉన్న కారణంగా అధికారులు వీరి ఆఫీస్ లను కూడా తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.
Raghu Kunche: మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఇంట విషాదం
ఇండియాలోనే పేద రియల్ ఎస్టేట్స్ కంపెనీలు.. మై హోమ్, ఫోనిక్స్ లకు వీరికి మధ్య వ్యాపారలావాదేవీలు ఉన్నట్లు సమాచారం.. రియల్ ఎస్టేట్స్ కంపెనీలపై దాడులు నిర్వహించగా.. అందులో వీరి పేర్లు కూడా రావడంతో అధికారులు నాగవంశీ ఇంటిని, ఆఫీస్ ను తనిఖీ చేసినట్లు చెప్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఈ బ్యానర్స్ లో గత కొంతకాలంగా పెద్ద సినిమాలు కూడా ఏమి రాలేదు. ఇప్పుడు అయితే చిన్న సినిమాలు బుట్టబొమ్మ, డీజే టిల్లు సీక్వెల్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత నేయి తెలియాలంటే నాగవంశీ నోరువిప్పక తప్పదు.
