Isha Koppikar Reveals Facing Casting Couch: ఇషా కొప్పికర్ W/o వర ప్రసాద్ అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే ఆ సినిమాలో ఓ పాట కోసమే డ్యాన్స్ చేసైనా 98లో చంద్రలేఖ అనే తెలుగు సినిమాతో ఆమె కథానాయికగా రంగప్రవేశం చేసింది. ఇక సౌత్ లో చాలా తమిళ సినిమాలు చేసిన ఆమె తరువాత బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయింది. చివరిగా ఆమె కేశవా అనే తెలుగు సినిమాలో కనిపించింది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి చెప్పింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘పాత్రలను నిర్ణయించే శక్తి ఎక్కువగా హీరోలకు మాత్రమే ఉండేది. ఆ సమయంలో చాలా మంది నటీమణులు ఒత్తిడి కారణంగా సినిమా పరిశ్రమ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
Ashwini Dutt: కాళ్ళు మొక్కబోయిన అమితాబ్.. అశ్వనీదత్ ఎమోషనల్!
అయితే నాతో సహా కొంతమంది పరిశ్రమలో పట్టు వదలకుండా కొనసాగుతున్నారు. నాకు 18 సంవత్సరాలప్పుడు సినిమాల్లో అవకాశం రావాలంటే నటీనటులతో ‘ఫ్రెండ్లీ’గా ఉండమని సలహా ఇచ్చారు. నేను చాలా స్నేహపూర్వకంగా ఉన్నాను, కానీ ‘స్నేహపూర్వక’ అంటే అర్ధం వేరే అని తరువాత తెలిసింది. 23 సంవత్సరాల వయస్సులో బాధాకరమైన కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని ఆమె అన్నారు. ‘‘ఆ సమయంలో అగ్రస్థానంలో ఉన్న ఓ హీరో తనను ఒంటరిగా కలవాలని నన్ను అడిగాడు. నాతో పాటు నా డ్రైవర్ లేదా మరెవరూ ఉండకూడదని కూడా చెప్పాడు. నేను కొంతమంది నటీమణులతో రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ ఇప్పటికే రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఆ ఇబ్బంది రాకుండా ఎవరూ లేకుండా ఒంటరిగా నన్ను కలవడానికి రావాలి అన్నాడు. కానీ నేను అతనిని కలవడానికి నిరాకరించాను అని ఆమె పేర్కొంది. ఇక కొంతమంది నటీనటులు, దర్శకులతో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి కూడా ఇషా చెప్పింది.