Vijay Devarakonda: అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది.. ఏమి లేని ఆకు ఎగిరేగేరి పడుతోంది అని తెలుగులో ఒక సామెత ఉంది. ప్రస్తుతం ఈ సామెత విజయ్ దేవరకొండకు వరిస్తుందని ప్రతి ఒక్కరు చెప్పుకొస్తున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో హీరో నాని పక్కన కనిపించే కుర్రాడు.. పెళ్లి చూపులతో హీరోగా తొలి ప్రయత్నంలోనే హిట్ అందుకున్న అబ్బాయి.. ఒక్కసారిగా అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. యాటిట్యూడ్ ను చూపిస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడి ఎంతోమంది ఫ్యాన్స్ ను పోగేసుకున్నాడు. ఇక సినిమా మీద ఉన్న నమ్మకంతో మాట్లాడాడు అనుకోని వదిలేశారు. ఆ తర్వాత కూడా అదే యాటిట్యూడ్ ను కొనసాగించాడు అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. కష్టపడి పైకి వచ్చిన హీరో అని చెప్తున్నారు.. ఇండస్ట్రీలో మొదటిసారి ఈ హీరో ఒక్కడే రాలేదు.. చాలామంది యంగ్ హీరోలు కష్టపడి పైకి వచ్చి ఇంతకంటే ఎక్కువే హిట్స్ అందుకున్నారు. మరి వారెందుకు కామ్ గా పనిచేసుకొంటున్నారు. రెండు సినిమాలకే ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ అంటూ రౌడీ హీరోను ఏకిపారేస్తున్నారు. ఒక్క అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా రౌడీ హీరో బిహేవియర్ కు విసిగిపోయి ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు డైరెక్ట్ గా చెప్తుంటే.. మరికొందరు ఇన్ డైరెక్ట్ గా హింట్లు ఇస్తున్నారు.
ఇక దీనికి ఇంకా ఆజ్యం పోసింది లైగర్ సినిమా. పాన్ ఇండియా సినిమా అని, బాలీవుడ్ లో కోట్లు పెట్టి తీసున్నామని చెప్పుకొచ్చి విజయ్ ను ఆకాశానికెత్తేశారు. రౌడీ హీరో కూడా ప్రమోషన్స్ లో కాలు మీద కాలు వేసుకొని అడగండి.. నేను కూడా కాలు మీద కాలు వేసుకొని చెప్తా .. సినిమా నచ్చితే చూస్తారు.. లేకపోతే మానేస్తారు అంటూ మాట్లాడాడు. ఇంకేముంది హీరోగారి యాటిట్యూడ్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరే.. అంతకు ముందులా సినిమా మీద నమ్మకంతో మాట్లాడాడు అనుకున్నా ఈ సినిమాలో తలా లేదు.. తోక లేదు అని చెప్పుకొస్తున్నారు. అసలు ఇవన్నీ పక్కన పెట్టి.. రెండు సినిమాలు హిట్ అవ్వగానే స్టార్ హీరో అనుకోని ఇలా తల ఎగరెయ్యడం ఎంత వరకు కరెక్ట్ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మా అయ్య తెల్వదు.. మా తాత తెల్వదు అని అంత పొగరుగా చెప్పుకు వస్తే.. ఏ ప్రేక్షకుడు థియేటర్ కు వస్తాడు. ఇక విజయ్ ను టాలీవుడ్ టార్గెట్ చేసింది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అలా టార్గెట్ చేసేవరకు ఎందుకు విజయ్ తెచ్చుకున్నాడు అనేది ఇక్కడ పాయింట్.
కొత్త తరాన్ని ఎంకరేజ్ చేసే స్టార్ హీరోలు ఉన్న టాలీవుడ్ లో ఇలా ఓవర్ మాటలతో వారిని విజయ్ హర్ట్ చేస్తున్నాడు అనేది కొంతమంది మాట. డిఫరెంట్ గా అందరిలో ఉండాలి అనుకోవడంలో తప్పులేదు.. కానీ వేరేవారిపై విమర్శలు చేయడం అనేది తప్పు. ఈ ప్రవర్తనే.. విజయ్ కెరీర్ ను ముంచేస్తుందా..? అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న చర్చ. కెరీర్ ను సెట్ చేసుకొనే దశలో ఉన్నప్పుడు ఒక చిన్న అడుగు పక్కకి పడినా మొదటికే మోసం వస్తుందని విజయ్ అర్డం చేసుకొంటే మంచిదని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా మంచి కథలను ఎంచుకొని, హద్దుమీరకుండా ఇండస్ట్రీలో ఉండడం ఉత్తమమని చెప్పుకొస్తున్నారు. మరోపక్క విజయ్ ఇవేమి పట్టించుకోకుండా తన పంథా తనదే అంటూ తిరుగుతున్నాడు. మరి ముందు ముందు రౌడీ హీరో కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.
