NTV Telugu Site icon

Pushpa 2 : తగ్గేదేలేదనే పుష్ప వెనక్కి తగ్గడానికి ఇంత కథ ఉందా?

Pushpa 2

Pushpa 2

Is this Main Reason for Pushpa 2 Postponement: పుష్ప అనగానే మనకు అల్లు అర్జున్ మార్కు డైలాగ్ తగ్గేదేలే అనేది గుర్తొస్తుంది. అయితే అనూహ్యంగా పుష్ప 2 సినిమా ఇప్పుడు వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపించింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే కలలో కొన్ని కీలకమైన ఎలిమెంట్స్ మీద ఆసక్తికరంగా సెకండ్ హాఫ్ కి లీడ్ వదిలారు. ఇక పుష్ప సినిమా రిలీజ్ అయి కొన్నేళ్లు గడుస్తోంది. ఇప్పటికే పుష్ప రెండో భాగాన్ని రిలీజ్ చేయాలి కానీ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అవుతుంది అనుకుంటే పలు కారణాలు చెబుతూ ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఈ వాయిదా వేయడానికి గల కారణం సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడమే అని సినిమా యూనిట్ చెబుతోంది.

Pushpa 2: అనుకున్నట్టే అయింది.. డిసెంబర్ కి పుష్ప 2 వాయిదా

ఇంకా 40 నుంచి 50 రోజుల షూటింగ్ మిగిలిపోయిందని, దానికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేయాల్సి రావడంతో ఆగస్టు 15వ తేదీకి రిలీజ్ చేయడం కష్టమేనని భావించి సినిమాని వాయిదా వేసినట్లు చెబుతున్నారు. నిజానికి నిర్మాతలతో పాటు హీరో అల్లు అర్జున్ కూడా ఎట్టి పరిస్థితుల్లో సినిమాని ఆగస్టు 15 రిలీజ్ చేయించాలని చాలా ప్రయత్నించారు. దర్శకుడు సుకుమార్ మాత్రం సరైన ఔట్పుట్ రాకపోతే సినిమా వాయిదా వేయడం ఖాయమని ముందు నుంచి వారికి చెబుతూ వచ్చారు. ఒకరకంగా నిర్మాతలు, హీరో మధ్య దర్శకుడు నలిగి పోయినట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఎట్టకేలకు పుష్ప వాయిదా పడింది. వాయిదా పడడానికి క్వాలిటీ అనేది ముఖ్యమైన కారణం అని సినిమా యూనిట్ చెబుతోంది. అయితే మరొక కారణం కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అదేమంటే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి గాని తెలుగుదేశానికి కానీ ఆయన ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. కేవలం పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా సంఘీభావం తెలిపారు. కానీ బయటి వారయినా వైసిపి అభ్యర్థి కోసం ఇంటికి వెళ్లి పలకరించి రావడం చర్చనీయాంశమైంది. మెగా అభిమానుల నుంచి అల్లు అర్జున్ మీద కాస్త ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతాయనే నేపద్యంలో ఇప్పటికిప్పుడు సినిమా రిలీజ్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందేమోనని కూడా ఆలోచించి వెనక్కి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే షూట్ ఇంకా పూర్తి కాకపోవడమే ముఖ్యమైన కారణంగా చెప్పొచ్చు. ఒకవేళ షూట్ నిజంగా పూర్తి అయిపోయాక కూడా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని వెనక్కి వెళితే అప్పుడు భయపడి వెనక్కి తగ్గినట్టు భావించవచ్చు. అది కాదు కాబట్టి టెక్నీకల్ అంశాలతోనే వాయిదా పడిందని చెప్పొచ్చు.