టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస భారీ చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వంలో హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్నా ఈ మూవీ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రస్తుతం కొంత బ్రేక్ తీసుకుంది. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వాల్సిన ‘రాజా సాబ్’ వాయిదా పడింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కానీ మూవీ టీం నుంచి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. ఇక వచ్చేది ఎలాగో సమ్మర్ కాబట్టి ఈ మూవీకి ఇది మంచి అవకాశం అనుకుంటే, సమ్మర్ రిలీజ్ కూడా లేనట్టుగానే తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే..
తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు షూట్ చేసిన భాగం మొత్తం మూడు గంటల 30 నిమిషాల ఫుటేజ్ వచ్చినట్లు టాక్. అదీ కాక మేజర్‌గా ఇంకా మూడు పాటలు షూట్ చేయాల్సి ఉందట. కానీ హీరోయిన్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వేరే సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో ఇప్పట్లో ఆ సాంగ్స్ షూటింగ్ పూర్తి అయ్యేలా కనిపించడం లేదు.అందులోను 3 గంటల 30 నిమిషాల సినిమా అంటే అదీ హారర్ జోనర్‌లో రిస్క్ అనే చెప్పాలి. కాబట్టి ఈ సినిమాని ఎడిట్ చేసి నిడివి తగ్గించే పనిలో కూడా ఉన్నారట మూవీ టీమ్. మరి ‘ది రాజాసాబ్’ ఆలస్యానికి కారణం ఇదేనా లేక వేరే ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. దీనికి తోడు జూలై 24న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది అని సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ‘బాహుబలి ది బిగినింగ్’ కూడా జూలై 24న విడుదల కావడంతో, ‘రాజా సాబ్’ ని కూడా అదే డేట్ కి రిలీజ్ చేస్తే బాహుబలి సెంటిమెంట్ వర్కౌట్ అవుతోందనే ఆలోచనలో మూవీ టీం ఉన్నట్లు చిన్న చర్చ నడుస్తోంది.
