Site icon NTV Telugu

Balayya : బాలయ్య తో శ్రీదేవి నటించకపోవడానికి కారణం అదేనా..?

Whatsapp Image 2023 06 13 At 2.59.20 Pm

Whatsapp Image 2023 06 13 At 2.59.20 Pm

అందాల తార,అతిలోక సుందరి అయిన శ్రీదేవి బాలనటిగా తన కెరీయర్ ను ప్రారంభించింది.అనతి కాలంలో నే అగ్ర హీరోల తో కలిసి నటించింది. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల లో ఒక్క బాలకృష్ణ తో తప్ప చాలామంది సీనియర్ హీరోల తో ఆమె కలిసి నటించింది..బాలకృష్ణ కూడా బాల నటుడుగానే ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత స్టార్ హీరో గా మారాడు.అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాకపోవడం అందరిని ఆశ్చర్యం కలుగ జేసింది.1970 లో వచ్చిన మా నాన్న నిర్దోషి అనే సినిమాలో బాలనటిగా తన కెరియర్ను ఆమె ప్రారంభించింది శ్రీదేవి.1978లో 16 ఏళ్ళ వయసు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఆ తర్వాత ఎన్నో సినిమాల లో నటించింది. బాలయ్య 1974 లో తాతమ్మ కల అనే సినిమా ద్వారా బాలనటుడి గా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాలు చేసి మంచి గుర్తింపు ను తెచ్చుకున్నారు.

ఇక అదే సమయం లో టాలీవుడ్ హీరోలై న ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ , వెంకటేష్, చిరంజీవి మరియు నాగార్జున వంటి సీనియర్ హీరోల తో కూడా నటించిన శ్రీదేవి బాలయ్య తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. దాని వెనుక ఒక పెద్ద కథ ఉంది .అది ఏమిటి అంటే 1987లో డైరెక్టర్ రాఘవేంద్రరావు బాలకృష్ణ , శ్రీదేవితో ఒక సినిమా చేయాలని అనుకున్నారని సమాచారం. సినిమాని కూడా ప్రకటించారు ఆ సినిమానే సామ్రాట్. అదే సమయంలో 1989లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో భలే దొంగ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారని సమాచారం. అందులో శ్రీదేవిని హీరోయిన్గా తీసుకున్నారట.. దాంతో శ్రీదేవి బాగా బిజీగా ఉండడంతో సామ్రాట్ మూవీ కి డేట్స్ కుదరలేదని అందుకే బాలయ్య పక్కన నటించలేదు అని తెలుస్తుంది. అయితే కాల్ షీట్ డేట్స్ అడ్జస్ట్ కాక వీళ్ళిద్దరూ నటించలేదన్న వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి

Exit mobile version