Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. ఈ ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. ఇక ఈ సినిమాను నిర్మించింది స్వయానా రామ్ చరణ్. దీంతో మెగా ఫ్యామిలీ భారీ నష్టాన్ని భరించాల్సి వచ్చింది. ఎన్నో అంచనాలు పెట్టుకొని థియేటర్ కు వెళ్ళిన అభిమానులు ఊసురుమంటూ బయటికి వచ్చారు. చిరు కెరీర్ లోనే ఆచార్య భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇక ఇదంతా డైరెక్టర్ కొరటాల శివ వలనే జరిగిందని చిరు చాలాసార్లు ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. సమయం వచ్చినప్పుడల్లా ఆ విషయాన్ని చెప్తూ ఉండడంతో ఇంకా కొరటాల పై చిరుకు కోపం తగ్గలేదని అనిపిస్తోంది. మొన్నటికి మొన్న లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో డైరెక్టర్స్.. సెట్ లోనే డైలాగ్స్ రాస్తున్నారని, అది మంచి పద్దతి కాదని, దానివలన నటుల ఫోకస్ పోతుందని చెప్పుకొచ్చాడు.
ఇక నిన్నటికి నిన్న ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ డైరెక్టర్స్ ద్రుష్టి కథ మీద పెట్టాలి.. హీరోల డేట్స్ లేవు, దొరకడం లేదు అని త్వరత్వరగా తీసేస్తే సినిమా ఆ రిజల్ట్ హీరోల మీద పడుతుందని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులకు ఏది అవసరమో దాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయాలని, రెండో రోజే సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోతుందని, అలాంటి బాధితుల్లో తాను కూడా ఒకరని చెప్పుకొచ్చాడు. ఇక చిరు చెప్పింది ఖచ్చితంగా శివ కొరటాల గురించే అని అభిమానులు అంటున్నారు. చిరు ఆచార్య ప్లాప్ ను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే ఇంకా కొరటాలపై కోపం చూపిస్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు.