Site icon NTV Telugu

Maruthi: ప్రభాస్‌తో కామెడీ సినిమానే చేస్తున్నాడా?

Prabhas

Prabhas

Maruthi: ఈ జనరేషన్ లో పాన్ ఇండియా అనే పదాన్ని అందరికీ పరిచయం చేసిన హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్, ఆ తర్వాత ఆశించిన రేంజ్ హిట్స్ ఇవ్వలేదు. ఫ్లాప్ సినిమాలతో కూడా వంద కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ ని రాబట్టగల ప్రభాస్, తన ట్రేడ్ మార్క్ అయిన యాక్షన్ జానర్ ని వదిలి లవ్ ట్రాక్ ఎక్కడు. దీని ఇంపాక్ట్ బాక్సాఫీస్ దెగ్గర బాగా కనిపించింది. ఒక్క ఫైట్ లేకుండా ప్రభాస్ లాంటి కటౌట్ ఉన్న హీరో సినిమా చేస్తే, ఆడియన్స్ ఆ మూవీని చూడడానికి రెడీగా లేరేమో అనే అనుమానం రాదే శ్యాం సినిమా కలిగించింది. దీంతో ప్రభాస్ లవ్ ట్రాక్ వదిలి, ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ వైపు అడుగులు వేసి సలార్ సినిమా చేస్తున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిక్ డ్రామాగా ప్రశాంత్ నీల్ సలార్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీతో ప్రభాస్ మళ్లీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడని ప్రభాస్ ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కి, ప్రభాస్ రేంజ్ మాస్ ఇమేజ్ ఉన్న హీరో పడితే ఎలా ఉంటుందో సలార్ చుపించాబోతోంది.

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నింటికన్నా సలార్ పైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి అంటే, హోంబేల్ మేకర్స్ ప్రభాస్ బలాన్ని నమ్ముకోని సినిమాలు చేస్తున్నారని అర్ధం. ఈ స్త్రెంగ్త్ ని వదిలేసి మారుతీ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడట. ప్రభాస్ హీరోగా, మారుతీ దర్శకుడిగా, మాళవిక మోహనన్ హీరోయిన్ గా ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెట్లోస్ నుంచి ప్రభాస్ ఫోటోస్ కొన్ని లీక్ అయ్యి సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ప్రభాస్ కుర్చీలో కూర్చోని స్టైలిష్ గా ఉన్నాడు కానీ ప్రభాస్ ఫాన్స్ మాత్రం మారుతీ సినిమాని పెద్దగా కేర్ చేస్తున్నట్లు కనిపించట్లేదు. ప్రభాస్-మారుతీ సినిమా ఓపెనింగ్ జరగబోతోంది అనే వార్త బయటకి రాగానే, ఈ సినిమా చెయ్యొద్దు అన్నా అంటూ రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో షేక్ చేసిన ప్రభాస్ ఫాన్స్ అంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం… మారుతీ, ప్రభాస్ తో కలిసి కామెడీ సినిమా చేస్తున్నాడు అనే కారణంగానే. ఎవరు అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యలేదు కానీ ఫిల్మ్ నగర్ వర్గాల్లో జరుగుతున్న డిస్కషన్ ని బట్టి చూస్తే… మారుతీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అప్పుడప్పుడూ ప్రభాస్ లోకి ఒక ఆత్మ వచ్చి వెళ్తుందని, దాని ద్వారా ఫన్ జనరేట్ చేస్తూ సినిమా సాగుతుందట. ప్రభాస్ తో కామెడీ టచ్ ఉన్న సినిమా లేదా పూర్తిస్థాయి కామెడీ సినిమా చేయాలంటే దర్శక నిర్మాతలకి చాలా ధైర్యం కావాలి. కథలో ఎంతో విషయం ఉంటేనే ఆ సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుంది. మారుతీ ట్రాక్ రికార్డ్ చూస్తే ప్రభాస్ ఫాన్స్ కి ఆ ధైర్యం వచ్చే అవకాశం తక్కువ. హారర్ కామెడి జానర్ లో రూపొందుతున్న సినిమా అనే వార్త వినీ భయపడుతున్న ప్రభాస్ ఫాన్స్, ఆ కటౌట్ తో కామెడీ సినిమా ఏంటబ్బా అనే ఫీలింగ్ లో ఉన్నారు. మరి అందరి అనుమానాలని చెరిపేస్తూ మారుతీ, రెబల్ స్టార్ ఫాన్స్ కి హారర్ కామెడీ జోనర్ లో సాలిడ్ హిట్ ఇస్తాడేమో చూడాలి.

Exit mobile version