NTV Telugu Site icon

Manchu Manoj: మంచు మనోజ్ రెండో పెళ్లి.. త్వరలో మీడియా ముందుకు ఆమె..?

Manoj

Manoj

Manchu Manoj: మంచు వారబ్బాయి మంచు మనోజ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. దివంగత నేత భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే మనోజ్- మౌనిక చెట్టాపట్టాలేసుకొని కెమెరా ముందు కనిపిస్తుండడంతో ఈ వార్త నిజమే అని తెలుస్తోంది. అయితే ఈ పెళ్లి విషయమై మనోజ్ మాట్లాడుతూ.. సందర్భం వచ్చినప్పుడు తానే స్వయంగా మాట్లాడతానని చెప్పుకొచ్చాడు. ఇక ఆ సందర్భం వచ్చిందని ఆనుతున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు. తాజాగా మనోజ్- మౌనిక పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందని, ఆ విషయాన్నీ అధికారికంగాక చెప్పడానికి మౌనిక అక్క భూమా అఖిల ప్రియా రంగంలోకి దిగిందని సమాచారం.

ఒకటి రెండు రోజుల్లో అఖిల్ ప్రియ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చెల్లి పెళ్లి విషయాన్నీ అధికారికం చేయనున్నదట. పెళ్లి డేట్, వెన్యూ గురించి మాట్లాడనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇటీవలే భూమా అఖిల, చెల్లి మౌనికతో కలిసి మంచు ఫ్యామిలీని మీట్ అయ్యిందని, ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఆమె మీడియా ముందు వెల్లడించడానికి సిద్దమయ్యిందని అంటున్నారు. అయితే మరోపక్క మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదని, అందుకే ఇన్నిరోజులు మౌనంగా ఉన్నారని మరికొందరు అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలన్నా.. మనోజ్ పెళ్లి డేట్ ఎప్పుడో తెలుసుకోవాలన్నా భూమా అఖిల ప్రియ మీడియా ముందుకు వచ్చేవరకు ఆగాల్సిందే.