Tilak Varma – Sreeleela : శ్రీలీల – తిలక్ వర్మ.. టీ20 లవ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెటర్లు, సినిమా హీరోయిన్ల మధ్య ప్రేమాయణాలు నడవడం భారతీయ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో చూస్తున్నదే. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో కొత్త జంట చేరిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. టీమిండియా వర్ధమాన క్రికెటర్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్, తెలుగువాడు తిలక్ వర్మ.. టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీలతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరి పేర్లు నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారాయి.
వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనడానికి నెటిజన్లు నిన్నటినుండి సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. గతంలో తిరుమల శ్రీవారి ఆలయ దర్శనానికి శ్రీలీల తన కుటుంబంతో వచ్చిన సమయంలోనే, తిలక్ వర్మ కూడా తన కుటుంబంతో కలిసి అక్కడే కనిపించడం విశేషం. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లలో శ్రీలీల కుటుంబ సభ్యులు ముంబై ఇండియన్స్ ఆడే మ్యాచ్‌లకు హాజరు కావడం స్టేడియంలో తిలక్ పేరు గల జెర్సీలు కనిపించడం వంటి పరిణామాలు ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోశాయి. దీంతో వీరిద్దరూ గత ఏడాది కాలంగా డేటింగ్లో ఉన్నారంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, కేఎల్ రాహుల్-అతియా శెట్టిల తరహాలోనే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ యంగ్ స్టార్స్ కూడా ఆ బాటలోనే పయనిస్తున్నారా? అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ వార్తలు ఇంటర్నెట్లో ఎంతగా చెక్కర్లు కొడుతున్నప్పటికీ దీనిపై అటు తిలక్ వర్మ కానీ ఇటు శ్రీలీల కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ డేటింగ్ రూమర్లను వారు అంగీకరించనూ లేదు అలాగని ఖండించనూ లేదు. అయితే ఇవన్నీ పుకార్లేనని, అసలు ప్రేమ, గీమా ఏది లేదని ఫోకస్ అంత ఇప్పుడు సినిమాలేనని శ్రీలీల సన్నిహితులు తెలిపారు.
Also Read
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
- RC17 : రామ్ చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
- Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?