Site icon NTV Telugu

సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా సోనాక్షి సిన్హా..?

sonakshi

sonakshi

బాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లి భాజాలు మోగుతున్నాయి. స్టార్ హీరో హీరోయిన్లు ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. ఇప్పటికే కత్రినా- విక్కీ కౌశల్ పెళ్లి వేడుక దగ్గర్లో ఉండగానే.. మరో స్టార్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కనుందన్న వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి కూతురుగా కనిపించబోతుందట.. అది కూడా కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా రాబోతుందట. వీరిద్దరూ కలిసి ‘దబాంగ్’ లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ బావ బంటీ సచ్దేవ్ తో సోనాక్షి డేటింగ్ చేస్తుందట.. వీరిద్దరూ ముంబై వీధుల్లో, పలు వేడుకల్లో కనిపించారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరి పెళ్లి కూడా కానున్నట్లు సమాచారం.

సల్మాన్ కుటుంబ సభ్యుడు అంటేసల్మాన్ కుటుంబమే.. ఇక దీంతో త్వరలోనే సోనాక్షి, సల్మాన్ ఇంటికి కోడలిగా రాబోతున్నటే అని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. అయితే ఇంకొక ఆసక్తికరమైన విష్యం కూడా బాలీవుడ్ వర్గాలను షేక్ చేస్తోంది. సోనాక్షి ఒక ఇంటర్వ్యూ లో తన ఫస్ట్ బ్రేకప్ స్టోరీ చెప్పిన విషయం తెలిసిందే.. స్కూల్ చదువుతున్న రోజుల్లోనే తాను ప్రేమలో పడ్డానని, అతడితో ఐదేళ్లు సీరియస్ రిలేషన్ లో ఉన్నానని , ఆ తరువాత కొన్ని కారణాల వలన విడిపోయినట్లు చెప్పుకొచ్చింది. ఇక సోనాక్షి ప్రేమించి, వదిలేసిన ఆ కుర్రాడు ఎవరో కాదు.. ఇప్పుడు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న బంటీ సచ్దేవ్ యేనట.. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Exit mobile version