Intresting Dialouges in Yatra 2 Movie: మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమా సూపర్ హిట్ కాగా ఆ సినిమాకి కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిస్తే 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఈ యాత్ర 2 సినిమా తెరకెక్కించారు. వైఎస్ జగన్ గా జీవ, వైఎస్ భారతిగా కేతకి నారాయణ్, విజయమ్మగా ఆశ్రిత వేముగంటి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎమోషన్స్ ని ప్రధానంగా పెట్టుకుని చాలా సీన్స్ నడిపించాడు దర్శకుడు. ఆ సంగతి అలా ఉంచితే కొన్ని సీన్స్ లో ఉన్న డైలాగులు కూడా బాగా పేలాయి. . ముఖ్యంగా దర్శకుడు మహి వి రాఘవ్ కూడా కడప జిల్లాకు చెందిన వాడు కావడంతో కడప జిల్లాని ఎలివేట్ చేస్తూ రాసుకున్న డైలాగ్స్ రాయలసీమ వాసులుని అలరించే విధంగా ఉన్నాయి. అలాగే సినిమాలో హైలైట్ గా నిలిచిన కొన్ని డైలాగ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం
Upasana Konidela: రాజకీయాల్లో వారికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు.. వెనక్కు లాగొద్దు
గెలిచిన వాడు నిద్రపోవచ్చు
గెలవాలి అనుకునే వాడు కాదు
..
అతను సూసైడ్ బాంబర్ లాంటి వాడు.
వాడితో పాటు మననీ తీసుకుపోతాడు
..
కడపోళ్ళకి ఎండలు.. కష్టాలు కొత్త కావు
..
రాజకీయాలు నాయకులకే
కార్యకర్తలకు తెలియవు
..
పిల్లిని అడవిలో వదిలినా పిల్లే
పులిని బోనులో పెట్టినా పులే
..
మనం పోరాడుతున్నది చంద్రబాబుతో
ఆయన్ని తక్కువ అంచనా వేయొద్దు
