NTV Telugu Site icon

Inti No-13: 72 థియేటర్లతో స్టార్టయి 120 థియేటర్లలో ‘ఇంటి నెం.13’

Inti Number 13

Inti Number 13

Inti No-13 Increased to 120 Theatres: సినిమాలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారని ‘ఇంటి నెం.13’ సినిమా ప్రూవ్‌ చేస్తోంది. నిజానికి ఎక్ట్రా ఆర్డినరీ కంటెంట్ ఉంటే తప్ప ఈ మధ్యకాలంలో థియేటర్లకు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. అలాంటిది మార్చి 1న విడుదలైన ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని అనూహ్యంగా థియేటర్లకు తరలి వచ్చి మరీ చూస్తున్నారు ప్రేక్షకులు. నిజానికి ఈ సినిమాను 72 థియేటర్లలో రిలీజ్‌ చేశారు, సినిమాకి మంచి టాక్‌ రావడంతో మౌత్‌ టాక్‌ బాగా స్ప్రెడ్‌ అవడంతో ఇప్పుడు ‘ఇంటి నెం.13’ చిత్రం రెండు రాష్ట్రాల్లో 120 థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఇక కలెక్షన్లు కూడా బాగా పెరిగాయని యూనిట్ చెబుతోంది.

NTR: దేవర అవ్వలేదు.. వార్ మొదలెట్టలేదు.. అప్పుడే ఇంకొకటా.. ?

ఈ సినిమా రెస్పాన్స్‌ గురించి దర్శకుడు పన్నా రాయల్‌ మాట్లాడుతూ ‘మార్చి 1న చాలా సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. వాటిలో పెద్ద సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు ఉన్నాయి. వాటి మధ్య రిలీజ్‌ అయిన మా సినిమాకి ఇంత మంచి టాక్‌ రావడం చాలా హ్యాపీగా ఉంది, ఎంతో సైలెంట్‌గా మొదలైన మా సినిమా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది అన్నారు. ప్రతి ఏరియాలోనూ సెకండ్‌ షోలు హౌస్‌ ఫుల్‌ అవ్వడం చూస్తే సినిమా ఏ రేంజ్‌ సక్సెస్‌ సాధించిందో అర్థమవుతుందని ఆయన అన్నారు.. 72 థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్‌ చేస్తే ఈ నాలుగు రోజుల్లో అన్ని ఏరియాల్లో థియేటర్లు పెరిగి ఇప్పుడు 120 థియేటర్లలో మా సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోందని అన్నారు. రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌, డి.ఎం. యూనివర్సల్‌ స్టూడియోస్‌ పతాకాలపై పన్నా రాయల్‌ దర్శకత్వంలో హేసన్‌ పాషా నిర్మించిన ఈ సినిమాకి సంగీతం వినోద్‌ యాజమాన్య అందించారు. సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌ సమకూర్చారు.