Site icon NTV Telugu

Devil: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ కోసం విదేశీ వాయిద్యాలు

Devil First Single

Devil First Single

International Music instruments for Devil Song: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’, ‘బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ఈమధ్యనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. డెవిల్ నుంచి వచ్చిన ‘మాయ చేశావే’ సాంగ్ హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమను చూపించి మెస్మరైజ్ చేసింది. డెవిల్ సినిమా 1940లో మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో సాగుతుంది. అంటే స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సన్నివేశాలు, పాటలను కూడా అదే రేంజ్ లో షూట్ చేశారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతి విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

Vishnupriyaa: రామ్ సాంగ్ తో రచ్చ చేసిన విష్ణుప్రియ.. ఊర్వశి కూడా ఈ రేంజ్ లో చూపించలేదేమో

నాటి కాలాన్ని, నాటి సంగీతాన్ని తెరపై చూపించే క్రమంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా దక్షిణ భారత దేశపు సహజమైన లొకేషన్లను ఎంచుకుని కారైకుడిలోని ప్యాలెస్‌లో ఈ పాటను షూట్ చేశారు. నాటి కాలంలోకి తీసుకెళ్లేందుకు సంగీతం కూడా ఎంతో ఉపయోగపడిందని, సంగీతం విషయంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్ ద్వయం కలిసి ఇలాంటి వింటేజ్ సాంగ్‌ క్రియేట్ చేశారు. ఈ పాటలో రకరకాల వాయిద్యాలు వాడారు. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్బుక.. దుబాయ్ నుంచి ఓషియన్ పర్‌క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ ఇలా రకరకాల వాయిద్యాలు ఈ పాటలో వాడడం గమనార్హం. సౌంద‌ర్ రాజ‌న్‌.ఎస్‌ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ సినిమాకి

Exit mobile version