Site icon NTV Telugu

నాగ చైతన్య వెబ్ సిరీస్ కు ఇంట్రెస్టింగ్ టైటిల్

Naga-chaitanya

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య OTT స్పేస్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చై అక్కినేని అమెజాన్ కోసం వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లనుంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని, హారర్ థ్రిల్లర్ అని టాక్ నడుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య జర్నలిస్ట్‌గా నటించనున్నారని మరోవైపు వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌పై ఆధారపడి ఉంటుందని, మొత్తం 24-30 ఎపిసోడ్‌లతో 3 సీజన్‌లు ఉంటాయని సమాచారం. నాగ చైతన్య పాత్ర రెండు విభిన్న షేడ్స్ కలిగి ఉంటుందట. ఇందులో తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించనుంది. ఇతర భాషల్లో కూడా విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ దక్షిణాది నటులు కూడా కనిపిస్తారు.

Read Also : థమన్ షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్

ఇదిలా ఉండగా తాజాగా వెబ్ సిరీస్ టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వార్తల ప్రకారం ఈ షోకు ‘ధూత’ అనే టైటిల్‌ను పెట్టినట్లు సమాచారం. మరి ఈ వార్తలన్నింటిలో నిజం ఎంతో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. చై ఈ సిరీస్ కోసం కొత్త లుక్‌లో కనిపిస్తాడు. మేకర్స్ ఇప్పటికే ఆయన లుక్‌ని ఫైనల్ చేశారు. ప్రస్తుతం చై తన కొత్త చిత్రం ‘థాంక్యూ’ షూటింగ్‌లో యూరప్‌లో ఉన్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక అమెజాన్ ప్రైమ్ సిరీస్‌ను ప్రారంభించనున్నాడు.

Exit mobile version