Site icon NTV Telugu

Silk Smitha: విశాల్ సినిమాలో సిల్కు స్మిత.. నిజంగా మళ్ళీ పుట్టిందా అన్నట్టుందే?

Silk Smitha Priyanka Gandhi

Silk Smitha Priyanka Gandhi

Instagram model Vishnu Priya Gandhi popularly known as Jr. Silk played Silk Smitha Role in Mark Antony: తెలుగువాడైనా తమిళంలో సెటిలై అక్కడ వరుస సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్. గతంలో ఆయన చేసిన అనేక సినిమాలు తెలుగులో కూడా ఆడడంతో ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నా దాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే విశాల్ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా మార్క్ ఆంటోనీ అనే సినిమా తెరకెక్కింది. పూర్తిస్థాయి పీరియాడిక్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ సినిమాని మొదటి నుంచి ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్లో విశాల్ ఎస్జే సూర్య వంటి వారు విభిన్నమైన గెటప్స్ లో కనిపించి ఆసక్తి రేకర్తించగా ఒక్కసారిగా సిల్క్ స్మిత దర్శనం ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం సిల్క్ స్మిత మరణించింది.

Devil Movie Sets: 1940లోకి వెళ్ళామా అనిపించేలా డెవిల్ సెట్స్.. చూశారా?

అయితే ఆమె నిజంగా మళ్లీ పుట్టి తిరిగి వచ్చిందా అని అనుమానం కలిగించే విధంగా ట్రైలర్లో ఆమె విజువల్ కట్ చేసి చూపించారు. నిజానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ తో ఆమెను మళ్లీ చూపించారు, ఏమో అని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవానికి సిల్క్ స్మిత అలా కనిపించడానికి కారణం కంప్యూటర్ గ్రాఫిక్స్ తో పాటు మరో మహిళ కూడా అని తెలుస్తుంది. సోషల్ మీడియాలో విష్ణుప్రియ గాంధీ అనే యువతి జూనియర్ సిల్క్ స్మితగా చలామణి అవుతోంది. సిల్క్ స్మిత లుక్స్ తో కనిపించే ఆమెను ఈ సినిమా కోసం సంప్రదించి నటింప చేసినట్లు తెలుస్తోంది. ఆమెను సిల్క్ స్మితగా చూపించేందుకు కంప్యూటర్ గ్రాఫిక్స్ ని కూడా వాడుకున్నారని దీంతో నిజంగా సిల్క్ స్మిత మళ్లీ పుట్టిందా అనే అంతలా కనిపిస్తోంది అని తెలుస్తోంది.

Exit mobile version