NTV Telugu Site icon

Indraja Shakar: పెళ్ళైన నెల రోజులకే విడాకులు.. నటి సంచలన వ్యాఖ్యలు!

Robo Shankar Daughter Divorce

Robo Shankar Daughter Divorce

Indraja Shankar Opens Up About Negative Comments On Her Marriage: ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ కూతురు ఇంద్రజ వివాహం యావత్ సినీ పరిశ్రమను ఆశ్చర్యపరిచేలా గ్రాండ్ గా జరిగింది. కోలాహలంగా సాగిన ఈ పెళ్లి నెల రోజులు దాటినా పెళ్లికి సంబంధించిన వివాదాలు మాత్రం ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉన్నాయి. ఇందు అని ఇంట్లో వాళ్ళు ముద్దుగా పిలుచుకునే ఇంద్రజ వివాహ వేడుకలు మధురైలో జరిగాయి, ఆ తర్వాత నెల రోజుల క్రితం చెన్నైలో ఘనంగా రిసెప్షన్ జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సంతోషకరమైన వేడుకలు ఎంతో ఘనంగా జరిగినప్పటికీ, వివాహానికి వివాదాలు తప్పలేదు. పెళ్లి అయినప్పటి నుండి అనేక ఊహాగానాలు వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి.

Guess the Actress: ఈ ఫోటో ఎవరిదో గుర్తుపట్టారా? సౌత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తోంది!

ఈ క్రమంలో వాటికి క్లారిటీ ఇవ్వడానికి తాజాగా ఇంద్రజ శంకర్, ఆమె భర్త ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇంద్రజ తనకు వచ్చిన అసహ్యకరమైన కామెంట్స్ గురించి మాట్లాడింది. నాపై ఎవరో కామెంట్ చేశారని అన్నారు. నేను ఆ వ్యక్తి పేరు మర్చిపోయాను. నేను స్క్రీన్‌షాట్ తీయడం లీడ మర్చిపోయాను. మీరు ఇంకెన్ని రోజులు జంటగా ఇంటర్వ్యూ చేస్తున్నారో చూద్దాం, త్వరలో విడివిడిగా ఇంటర్వ్యూ చేస్తారు.. త్వరలో విడాకులు తీసుకుంటారు’’ అని సదరు వ్యక్తి వ్యాఖ్యానించాడు. నా భర్త నాకు మూడు ముళ్ళు వేశాడు, ఇలాఅనడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అని ఇంద్రజ కామెంట్ చేసింది. ఇంద్రజ తన భర్తతో ఉన్న ఫోటోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేసింది. కొంత మంది నెటిజన్లు ఈ జంట త్వరలో ఇబ్బందులను ఎదుర్కొంటారని, బహుశా విడాకులు తీసుకోవచ్చని కామెంట్ చేశారు. ఇంద్రజ ఈ వ్యాఖ్యలు బాధాకరమని వ్యాఖ్యానించారు. వేరొకరి జీవితంపై అలాంటి తీర్పును ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు.

Show comments