Site icon NTV Telugu

Rana Daggubati: మమ్మల్ని క్షమించండి.. స్పందించిన ఇండిగో ఎయిర్ లైన్స్

Rana

Rana

Rana Daggubati: రానా దగ్గుబాటి ఇండిగో ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్పింది. నిన్న రానా.. ఇండిగో ఎయిర్ లైన్స్ మీద అసహనం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. తన లగేజ్ మిస్ అయ్యిందని, ఇండిగో సరైన విధంగా సమాధానం కూడా చెప్పలేదని రానా ట్వీట్ చేశాడు. ఇండిగో విమాన సేవలు సరిగ్గా లేవని, మిస్ అయిన లగేజ్ ను కనుక్కొనే పద్దతి కూడా తెలియదని మండిపడ్డాడు. ఇక తాజాగా రానా ట్వీట్ పై ఇండిగో స్పందించింది. రానాకు క్షమాపణలు చెప్తూ తమ తప్పుకు చింతిస్తున్నామని తెలిపింది.

“సర్.. మమ్మల్ని క్షమించండి. మీ లగేజ్ ను మేము వెతికి సరైన టైం కు ఇవ్వలేకపోయాం. దయచేసి కొద్దిగా సమయం ఇవ్వండి.. మీ లగేజ్ ను మేము అతి త్వరలోనే వెతికి ఇచ్చేస్తాం” అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే ఇండిగో సేవలపై రానా ఒక్కడే ఫిర్యాదు చేయలేదు.. ఎంతోమంది సెలబ్రిటీలు ఇండిగో బారిన పడినవారు. కొంతమంది రూడ్ గా బిహేవ్ చేశారని చెప్తే.. ఇంకొంతమంది విమానం లేట్ అవుతున్న ఇంటిమేట్ చేయలేదని మండిపడ్డారు. ఇక నుంచైనా ఇండిగో ఇలాంటివాటిని మానుకొని మంచి సర్వీస్ ఇస్తే బావుంటుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version