Site icon NTV Telugu

ఇండియాలో ల్యాండైన ఎన్టీఆర్ లగ్జరీ కారు

NTR Playing Volley ball Video Goes Viral

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కార్ల పట్ల మక్కువ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన గ్యారేజీలో చాలా టాప్-ఎండ్ కార్లు ఉన్నాయి. తాజాగా తారక్ బుక్ చేసిన ఓ లగ్జరీ కారు ఇప్పుడు ఇండియాలో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కు ఎన్టీఆర్ యజమాని. అంటే అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఒక్క ఎన్టీఆర్ దగ్గరే ఉందన్నమాట. ఇది అరోన్సియో అర్గోస్‌తో కాంట్రాస్ట్ కలర్‌తో నీరో నోక్టిస్ మాట్ తో కూడా వస్తుంది. ఈ ఫోటోలను బెంగళూరుకు చెందిన ఆటో మొబిలియార్డెంట్ పోస్ట్ చేసారు.

Read Also : దగ్గుబాటి మల్టీస్టారర్ లో కాజల్ సిస్టర్

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” మూవీలో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్ మరో ప్రధాన పాత్రలో కన్పించబోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “ఆర్ఆర్ఆర్” మూవీ షూటింగ్ ఇప్పుడు ఉక్రెయిన్ లో జరుగుతోంది. ఈ చివరి షెడ్యూల్ లో ఇద్దరు హీరోలపై భారీ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Exit mobile version