Bappi Lahiri : అంత్యక్రియలు పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ డిస్కో రాజా బప్పీ లహిరి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 15న దేశం సంగీత పరిశ్రమలోని మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది . ‘డిస్కో కింగ్’గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు, స్వరకర్త బప్పి లహిరి మంగళవారం రాత్రి పలు ఆరోగ్య సమస్యల కారణంగా ముంబై ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 69 ఏళ్ళ ఈ సంగీత దిగ్గజం అనేక దశాబ్దాలుగా తన గాత్రంతో లక్షలాది మందిని ఉర్రూతలూగించారు. సింగింగ్ లెజెండ్ బప్పీ లహిరి అంత్యక్రియలు ఫిబ్రవరి 17న ముంబైలోని విలే పార్లే శ్మశానవాటికలో జరిగాయి. ప్రముఖులు, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు బప్పీ అంత్యక్రియలకు హాజరయ్యారు.
Read Also : DJ Tillu : విజయ్ దేవరకొండ, అడివి శేష్ లాగా కాదు… 12 ఏళ్ళు…!
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
ఆయన అంత్యక్రియలకు హాజరైన వారిలో విద్యాబాలన్, మికా సింగ్, అల్కా యాగ్నిక్, ఇలా అరుణ్, శక్తి కపూర్, నిఖిల్ ద్వివేది, భూషణ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఫిబ్రవరి 17న తెల్లవారుజామున 3 గంటలకు బప్పి కుమారుడు బప్పా లహిరి తన తండ్రి అంత్యక్రియలను నిర్వహించడానికి తన కుటుంబంతో సహా లాస్ ఏంజెల్స్ నుండి తిరిగి వచ్చాడు. సమాచారం ప్రకారం బప్పీ లహిరి చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గత నెలలో ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్‌లో చేరారు. సోమవారం డిశ్చార్జి కాగా, ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం మళ్లీ ఆస్పత్రికి తరలించారు. అదే రోజు రాత్రి 11.45 గంటలకు అనారోగ్యంతో బప్పీ కన్నుమూశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా బప్పీ లహిరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వరుస ట్వీట్లతో అభిమానులు ఆయన సంగీతాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!