NTV Telugu Site icon

Indian 2 : ‘ఇండియన్ 2 ‘తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్న బడా నిర్మాతలు..

Indian 2

Indian 2

విలక్షణ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2 ‘.. 27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకేక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలు పెట్టిన యూనిట్ కొన్ని కారణాలు వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.. ఎట్టకేలకు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది..

ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బిజినెస్‌ ప్రారంభమైంది. తెలుగులో రైట్స్ అమ్ముడు పోయాయి. తెలుగు రైట్స్ ని ఏషియన్‌ సురేష్‌(సురేష్‌ ప్రొడక్షన్‌) ఎంటర్‌టైనర్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ దక్కించుకుంది. నిర్మాత సురేష్‌ బాబు సొంతం చేసుకోవడం విశేషం.. ఈ సినిమాకు రైట్స్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం 75కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్టు గతంలో గట్టిగానే వార్తలు వచ్చాయి. మరి ఏషియన్‌సురేష్‌ ఎంతకి దక్కించుకున్నారనేది తెలియాల్సి ఉంది.. పెద్ద సినిమాలను దిల్ రాజు సొంతం చేసుకుంటాడు.. కానీ ఈ సినిమా విషయం లో మౌనంగా ఉండటం పై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అందరిని తెగ ఆకట్టుకున్నాయి.. రిలీజ్‌ డేట్‌ విషయంలో క్లారిటీ లేదు. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సింది ఉంది.. ఇక ఇండియన్ 2 సినిమా తో పాటుగా ఇండియన్ 3 కూడా రాబోతుందని టాక్.. రెండు సినిమాల విడుదల ఒకేసారి ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఎప్పుడూ విడుదల చేస్తారో క్లారిటి రావాల్సి ఉంది..