NTV Telugu Site icon

Indian 2: సేనాపతి వచ్చేశాడు.. ఇండియన్ 2 నుంచి కమల్ లుక్ రిలీజ్

Kamal

Kamal

Indian 2: లోక నాయకుడు కమల్ హాసన్ – స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం భారతీయుడు. ఈ సినిమా 1996 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సేనాపతిగా కమల్ హాసన్ నటన ఇప్పటికి ఏ ప్రేక్షకుడు మర్చిపోడు అంటే అతిశయోక్తి కాదు. ఇక దాదాపు 25 ఏళ్ళ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు శంకర్. ఇండియన్ 2 పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈపాటికే ఈ సినిమా పూర్తికావాల్సి ఉండగా.. మధ్యలో ఎన్నో అడ్డంకులు చిత్రాన్ని చుట్టుముట్టాయి. వివాదాలు, కేసులు.. ఇలా మొత్తాన్ని ఒక కొలిక్కి తెచ్చి శంకర్ గతేడాది ఇండియన్ 2 ను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సేనాపతి లుక్ లో కమల్ పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే.

Game Of Thrones: తెలుగులో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’.. ఆ సీన్స్ ఉంటాయా మాస్టరూ.. ?

ఇక తాజాగా నేడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కమల్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. సేనాపతి కమల్ హాసన్ మిలటరీ లుక్ లో ఆగిపోయాడు. ఖాకీ డ్రెస్ .. జేబుకి జాతీయ జెండా.. గన్బెల్ట్ తో అదరగొట్టేశాడు. ముఖ్యంగా ముసలివాడిగా కమల్ కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది. సడెన్ గా చూస్తే కమల్ కాదేమో అనిపిస్తుంది. అంతలా ఆ పాత్రలో ఇమిడిపోయాడు కమల్ హాసన్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో సేనాపతి ఎలాంటి రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.

Show comments