NTV Telugu Site icon

Indian 2: ఇది డబ్బింగ్ ఓకే.. మరి మా గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటి శంకరూ.. ?

Shankar

Shankar

Indian 2: విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటీకే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఒక కీలక అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇండియన్ 2 సినిమాకు కమల్ డబ్బింగ్ సెషన్ మొదలుపెట్టాడు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా తెలిపారు. కమల్, శంకర్ డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్లడం, వారిద్దరూ ముచ్చటించడం లాంటివి ఈ వీడియోలో చూపించారు. ఇక ఇండియన్ 2 శరవేగంగా పూర్తవుతున్నందుకు ఆనందపడాలో.. గేమ్ ఛేంజర్.. లేట్ అవుతున్నందుకు బాధపడాలో తెలియడం లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Devara: షాకింగ్.. అనిరుధ్ అవుట్.. థమన్ ఇన్.. ?

రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ పెట్టి మరీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, లీక్డ్ సాంగ్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ సినిమా సగం కూడా పూర్తీ కాలేదని టాక్ నడుస్తోంది. ఈ సమయంలోనే దీని వదిలేసి.. ఇండియన్ 2 ను ఫినిష్ చేయడానికి వెళ్ళాడట శంకర్. ఆ సినిమా లంచ్ టైమ్ లో ఈ సినిమాను పూర్తిచేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇలా అయితే గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటి అని మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు ఎప్పుడు పూర్తి అయ్యి.. ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఆ దేవుడికే తెలియాలి అని అంటున్నారు ఫ్యాన్స్.

Show comments