Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Theatre Releases: ఈ ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ కావడంతో, థియేటర్లలో సినిమాల సందడి మొదలుకాబోతోంది. హిందీ, తెలుగు, తమిళం వరకు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో యాక్షన్, లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్, సస్పెన్స్ థ్రిల్లర్లతో కూడిన మొత్తం 10 రకాల సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఏ రకమైన సినిమా ఇష్టపడే వారికైనా ఈ వారం థియేటర్లలో బోలెడన్ని ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ లిస్ట్ ఏమిటో ఇప్పుడు ఓసారి చూసేద్దామా.
1. ఆవారాపన్ 2 (Awarapan 2)
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వస్తున్న ఈ మూవీ, 2007 నాటి క్లాసిక్ కల్ట్ ‘ఆవారాపన్’కు సీక్వెల్. ఇమ్రాన్ హష్మీ మళ్లీ ‘శివమ్ పండిట్’ పాత్రలో మరింత ఇంటెన్స్, యాక్షన్, రివేంజ్ తో వెండితెరపైకి రాబోతున్నారు. నితిన్ కక్కర్ దర్శకత్వంలో, విశేష్ భట్ నిర్మించిన ఈ హిందీ మూవీలో దిశా పటానీ, షబానా అజ్మీ కీలక పాత్రలు పోషించారు.
Also Read
- Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
- Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
- Mr Perfect Copyright Case: దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!
- Irumbudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న మేకర్స్
2. బట్వారా 1947 (Batwara 1947)
ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో వస్తున్న భారీ హిస్టారికల్ పీరియడ్ వార్ డ్రామా ఇది. 1947 దేశ విభజన నేపథ్యంలో, లాహోర్‌లోని ఒక పాత హవేలీ కథ చుట్టూ ఇది సాగుతుంది. సన్నీ డియోల్ పవర్ఫుల్ లీడ్ రోల్ పోషించగా, ఈ చిత్రంతో సీనియర్ నటి ప్రీతి జింటా ఎనిమిదేళ్ల విరామం తర్వాత గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. దీనికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు.
3. విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons)
తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతున్న ఒక కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు సూర్య ప్రధాన పాత్ర పోషించగా, ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్గా నటించింది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
4. మగుడం / మకుటం (Magudam / Makutam)
యాక్షన్ కింగ్ విశాల్ హీరోగా (ఆయన కెరీర్లో 35వ చిత్రం) నటిస్తున్న ఇంటెన్స్ మాస్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఇది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై విశాల్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుషారా విజయన్, అంజలి హీరోయిన్లుగా నటించారు. దీనికి జి.వి. ప్రకాష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. తెలుగు తమిళంలో ఈమూవీ థియేటర్లలో సందడి చేయబోతోంది.
5. ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్ (The End of Oak Street)
ప్రముఖ దర్శకుడు డేవిడ్ రాబర్ట్ మిట్చెల్ తెరకెక్కించిన ఈ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఒక వింతైన ఖగోళ పరిణామం వల్ల ‘ఓక్ స్ట్రీట్’ అనే వీధిలోని ప్రజలు ఒక్కసారిగా ప్రమాదకరమైన డైనోసార్లు ఉన్న ప్రపంచంలోకి వెళ్ళిపోగా, అక్కడ ఒక జంట తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటమే ఈ కథాంశం. జె.జె. అబ్రామ్స్ నిర్మాణంలో 1 గంట 39 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం భారతదేశంలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, మరియు తమిళ భాషల్లో కూడా ఐమాక్స్ (IMAX) స్క్రీన్లలో అందుబాటులోకి రానుంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ వీకెండ్‌కు మైండ్-బెండింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వడానికి ఇది సిద్ధమైంది.
6. అగధ (Agadha)
ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ తెరకెక్కించిన తెలుగు సూపర్‌నేచురల్ మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఇది. 2026 ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. తన తమ్ముడి ఆత్మహత్య, వరుస వింత మరణాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే క్రమంలో ‘మహాదేవి’ (కామాక్షి భాస్కర్ల) అనే యువతి ఒక నిషేధిత అడవిలోని రహస్య గుహకు చేరుకోవడం, అక్కడ ఒక పురాతన విగ్రహం వెనుక దాగి ఉన్న క్రూరమైన శక్తులతో ఆమె చేసిన ఆధ్యాత్మిక పోరాటమే ఈ మూవీ కథాంశం. శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, భాను చందర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
7. పళ్ళబురుసు (Pallaburusu)
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ తెలంగాణ రూరల్ కామెడీ 2026 ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కాబోతోంది. శంభు (సుధాకర్ రెడ్డి) అనే 68 ఏళ్ల వృద్ధుడు కేవలం ₹20 విలువచేసే టూత్‌బ్రష్ కొనివ్వలేదనే కారణంతో తన కొడుకు (మురళీధర్ గౌడ్) పై పోలీస్ స్టేషన్, కోర్టులో లీగల్ కేస్ ఫైల్ చేయడం అనే ఒక విచిత్రమైన కథాంశంతో దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పవన్ సీహెచ్ సంగీతం అందించిన ఈ సినిమా చూసి క్లైమాక్స్ ఎమోషన్స్‌కు తన కళ్లలో నీళ్లు తిరిగాయని అక్కినేని నాగార్జున ప్రశంసించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
8. పాంచాలి పంచ భర్తృక (Paanchaali Pancha Bharthruka)
నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ట్రెండీ కామెడీ క్రైమ్ తెలుగు థ్రిల్లర్ 2026 ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కాబోతోంది. నలుగురు ప్రాణ స్నేహితులు అనుకోకుండా ఒక అంతర్జాతీయ అండర్‌వరల్డ్ డాన్‌తో సంబంధం ఉన్న ఒక విదేశీ యువతి హత్యలో చిక్కుకోవడం, ఆ ఘోరమైన మర్డర్ మిస్టరీ సమస్య నుండి వారు ఎలా తప్పించుకున్నారనే కథాంశంతో దర్శకుడు గంగ సప్తశిఖర ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించారు. రోల్ రీడా, పృథ్వీ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించిన ఈ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ను రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయి రామ్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
9. ఛార్జ్‌షీట్ 03-08 (Chargesheet 03-08)
ఇదొక ఇంటెన్స్ కోర్ట్‌రూమ్ డ్రామా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా తెరకెక్కించిన ఈ హిందీ మూవీ 2026 ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కాబోతోంది. క హై-ప్రొఫైల్ పొలిటికల్ హత్య వెనుక ఉన్న నిజాలను వెలికితీస్తూ, దేశంలోని అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులు, అండర్‌వరల్డ్ మాఫియాను ఎదిరించి ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కోర్టులో ఛార్జ్‌షీట్ ఎలా దాఖలు చేశాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ పోలీస్ ఆఫీసర్‌గా, కే కే మీనన్ పవర్ఫుల్ విలన్‌గా నటించిన ఈ ఇంటెన్స్ కోర్ట్‌రూమ్ డ్రామా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్బింగ్ వెర్షన్లతో థియేటర్లలో అలరించడానికి సిద్ధంగా ఉంది.
10. ఆలి (Aali)
ఇది డాక్టర్ కృష్ణ ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఒక హార్ట్-టచింగ్ రొమాంటిక్ మలయాళ చిత్రం. 2026 ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఒక ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్ దుబాయ్‌లో పనిచేసే ఒక మహిళా ఆయుర్వేద డాక్టర్ మధ్య చిగురించిన అందమైన ప్రేమకథతో తెరకెక్కింది. కైలాష్, ప్రజిన్ పద్మనాభన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మలయాళంతో పాటు తమిళం, తెలుగు భాషలలో అలరించడానికి సిద్ధంగా ఉంది.
- Tags
- August 14 Releases
- cinema
తాజావార్తలు
-
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
-
PM SVANidhi Scheme: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
-
Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
ట్రెండింగ్
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?