ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ తొలి ఐఎన్సీఏ అవార్డ్స్ విజేతలని ప్రకటించింది. పన్నెండు భాషలు, పన్నెండు సినిమా ఇండస్ట్రీలను ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎన్సీఏ ఈ ఏడాది మొత్తం 25 కేటగిరీలలో విజేతల అనౌన్స్ చేశారు. ఉత్తమ తెలుగు చిత్రంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – మిరాయ్ సూపర్ యోధ విజేతగా ఎంపికైయింది. ఉత్తమ తెలుగు నటుడిగా నాగ చైతన్య (తండేల్) విజేతగా నిలిచారు. అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం) ఉత్తమ దర్శకుడిగా అవార్డ్ గెలుపొందారు.
🔹 హిందీ
ఉత్తమ నటుడు: రణవీర్ సింగ్ (ధురంధర్)
ఉత్తమ నటి: యామి గౌతమ్ ధర్ (హక్)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్ (ధురంధర్)
ఉత్తమ చిత్రం: దినేష్ విజన్ & మాడ్‌డాక్ ఫిలిమ్స్ – ఛావా
🔹 కన్నడ
ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1)
ఉత్తమ నటి: రుక్మిణి వసంత్ (కాంతార)
ఉత్తమ దర్శకుడు: రిషబ్ శెట్టి (కాంతార)
ఉత్తమ చిత్రం: హోంబలే ఫిలిమ్స్ – కాంతార
Also Read : Adivi Sesh : స్టార్ డైరెక్టర్స్ స్టార్స్‌ను మాత్రమే డైరెక్ట్ చేస్తారా?
🔹 మలయాళం
ఉత్తమ నటుడు: నివిన్ పాలీ (సర్వం మాయ)
ఉత్తమ నటి: కళ్యాణి ప్రియదర్శన్ (లోక చాప్టర్ వన్: చంద్ర)
ఉత్తమ దర్శకుడు: డొమినిక్ అరుణ్ (లోక చాప్టర్ వన్: చంద్ర)
ఉత్తమ చిత్రం: వే ఫారర్ ఫిలిమ్స్ – లోక చాప్టర్ వన్: చంద్ర
🔹 తమిళం
ఉత్తమ నటుడు: దుల్కర్ సల్మాన్ (కాంతా)
ఉత్తమ నటి: సిమ్రాన్ (టూరిస్ట్ ఫ్యామిలీ)
ఉత్తమ దర్శకుడు: మారి సెల్వరాజ్ (బైసన్ కాలమాడన్)
ఉత్తమ చిత్రం: మిలియన్ డాలర్ స్టూడియోస్, MRP ఎంటర్టైన్‌మెంట్ – టూరిస్ట్ ఫ్యామిలీ
🔹 తెలుగు
ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్‌ఫ్రెండ్)
ఉత్తమ దర్శకుడు: అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
ఉత్తమ చిత్రం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – మిరాయి సూపర్ యోధా
పన్నెండు భాషలు, పన్నెండు సినిమా ఇండస్ట్రీలను ప్రాతినిధ్యం వహిస్తూ ఐఎన్సీఏను అత్యంత విస్తృతమైన అకాడమీ వేదికగా రూపొందించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అనుభవజ్ఞులైన సభ్యులతో కూడిన జ్యూరీ ప్యానెల్ విజేతలని ఎంపిక చేసింది. ఐఎన్సీఏ అవార్డ్స్ వేడుక ఏప్రిల్ 16న ముంబైలో జరగనుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ దర్శకులు, నటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు పాల్గొనే ఈ వేడుక భారతీయ సినిమా రంగానికి ఒక ముఖ్యమైన ఈవెంట్‌గా నిలవనుంది.
