Site icon NTV Telugu

Ileana D’Cruz: వాళ్ళ వల్లే తెలుగులో నా కెరీర్ ముగిసింది.. ఇలియానా సంచలన వ్యాఖలు

Ileana

Ileana

Ileana D’Cruz Crucial Comments on Telugu Film Industry: తెలుగు, తమిళ సినిమాలలో వరుస అవకాశాలు వచ్చిన తర్వాత ఇక్కడ అవకాశాలు వదులుకొని మరి బాలీవుడ్ కి వెళ్లడం కొత్తేమీ కాదు. చాలా మంది హీరోయిన్లు గతంలో అలానే చేశారు. గోవా భామ ఇలియానా కూడా అలాగే బాలీవుడ్ మోజులో పడి టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసి చాలాకాలం అక్కడే సెటిలైంది. ఆ తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడంతో మళ్లీ తెలుగు సినీ పరిశ్రమ వంక చూసింది. ఇక్క ఆమెకు ఒక అవకాశం ఇచ్చినా పెద్దగా ఉపయోగ పడలేదు. వరుస డిజాస్టర్స్ నేపథ్యంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఇప్పుడు భర్తతో ఎంజాయ్ చేస్తోంది. పెళ్లయిన తర్వాత బాలీవుడ్ లో ఒకటి అర అవకాశాలు వస్తుంటే వాటిని చేస్తూ హ్యాపీ హ్యాపీగా గడిపేస్తోంది. ఇక తాజాగా ఆమె చేసిన ఒక సినిమా ప్రమోషనల్ ఆక్టివిటీస్ లో తెలుగు సినీ పరిశ్రమ గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. రవితేజతో చేసిన దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత బాలీవుడ్ కి వచ్చానని అప్పటి నుంచే తెలుగు ఆఫర్స్ కరువయ్యాయని ఆమె చెప్పింది.

Rashmi : వ్యభిచారం గురించి యాంకర్‌ రష్మి ఏంటి అలా అనేసింది!

తెలుగు సినీ పరిశ్రమలో బిజీగా ఉన్న సమయంలో బర్ఫీ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నిజానికి టాలీవుడ్ లో చాలా సినిమా అవకాశాలు నాకు ఉన్నా సరే ఎందుకో బర్ఫీ అవకాశాన్ని మాత్రం వదులుకోవాలి అనిపించలేదు. నేను జడ్జ్ చేసినట్టుగానే ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమె ఇంకా నటించదు అని కొంతమంది దర్శక నిర్మాతలు ప్రచారం చేశారు. ఆ దెబ్బతో తెలుగులో అవకాశం ఇస్తారు అనుకున్న వాళ్లు కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. నేను ముంబైలో ఉండడం వల్ల ఇక్కడే సెటిల్ అయిపోయాను అని అందరూ భావించారు. నేను ఎక్కడ నటించినా ఎంతో నిజాయితీగా అనే పని చేశానని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను పడిన కష్టానికి తగ్గ గుర్తింపు దక్కలేదేమో అని తాను ఫీల్ అవుతున్నానని ఆమె చెప్పకు వచ్చింది.

Exit mobile version