Site icon NTV Telugu

Ileana: అమ్మగా బిజీ అయినా.. రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఇలియానా !

Ileana

Ileana

వెండితెరకు 2006లో ‘దేవదాసు’ తో పరిచయమైన ఇలియాన, దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి హీరోలతో నటించి హిట్ చిత్రాలతో తన కెరీర్‌ గ్రాఫ్‌ను పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ కాస్త అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనని తాను నిరూపించుకుంది. ఇక ఇటీవల తన తల్లిగా తన బాధ్యత ఎక్కువగా ఉండటంతో కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే తాజాగా ఒక కార్యక్రమంలో ఇలియానా మాట్లాడుతూ..

Also Read : Sonakshi Sinha: ఆ వెబ్‌సైట్‌లో సోనాక్షి సిన్హా ఫోటోలు.. తీసేయాలని సీరియస్ నోటీసు !

‘నా ఇద్దరు పిల్లలను చూసుకోవడంలో బిజీగా ఉన్నప్పటికీ, నా అభిమానులను మిస్ అవుతున్న. మళ్లీ సినిమాల్లో రావడానికి త్వరపడడం లేదు. కానీ నా కెరీర్‌లోను, అభిమానుల కోసం కూడా మళ్లీ తెరపై అలరించడానికి సిద్ధంగా ఉన్నా’ అని తెలిపింది. అలాగే ఇలియానా తన రిటర్న్ గురించి కూడా స్పష్టత ఇచ్చారు. “ఏ పని చేసినా దానికి పూర్తి సమర్పణతో ఉంటాను. తిరిగి నటనకు రాబోతున్నప్పుడు మానసికంగానూ, శారీరకంగానూ పూర్తిగా సిద్ధంగా ఉండాలి, అందుకే కొంత సమయం పడుతుంది” అని పేర్కొన్నారు. తెలుగు తెరపై ఆమె చివరిసారి 2018లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లో కనిపించారు. అయితే, బాలీవుడ్‌లో కూడా పలు చిత్రాల్లో నటిస్తూ తన ప్రస్థానం కొనసాగించారు. ఇప్పుడు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు, ఎందుకంటే తల్లి అయినా, ఇలియాన త్వరలో మళ్లీ తెరపై హైలైట్ అవ్వబోతోందని స్పష్టమైంది.

Exit mobile version