Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్‌రూమ్ వార్ అదిరింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ikka Trailer: బాలీవుడ్లో కోర్ట్‌రూమ్ థ్రిల్లర్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఉత్కంఠంగా సాగే వాదనలు, చివరి వరకు సస్పెన్స్‌ను కొనసాగించే కథనంతో అలాంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. ఇప్పుడు అదే తరహాలో తెరకెక్కిన ‘ఇక్కా’ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్ నిన్న విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు నటులు మరోసారి ఒకే తెరపై కనిపించనున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దర్శకుడు సిద్ధార్థ్ పి. మల్హోత్రా తెరకెక్కించిన ‘ఇక్కా’ కోర్ట్‌రూమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందింది. గతంలో ‘బోర్డర్’ సినిమాలో కలిసి నటించిన సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచే మంచి హైప్ ఏర్పడగా, ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ఆ హైప్‌ను మరింత పెంచింది.
నిన్నరిలీజ్ అయిన ట్రైలర్లో అక్షయ్ ఖన్నా ‘శౌర్యమాన్ గౌర్’ అనే పాత్రలో కనిపిస్తారు. ఓ యువతిని హత్య చేయడానికి ప్రయత్నించాడనే ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు న్యాయానికి కట్టుబడి ఉండే ప్రముఖ లాయర్ ‘అర్జున్ మెహ్రా’ సహాయం కోరుతాడు. ఈ పాత్రను సన్నీ డియోల్ పోషించారు. సాధారణంగా నిందితుల తరఫున వాదించని అర్జున్, కొన్ని కారణాల వల్ల శౌర్యమాన్ కేసును తీసుకోవాల్సి వస్తుంది. అర్జున్, శౌర్యమాన్ మధ్య గతంలో ఉన్న సంబంధం ఏమిటి? శౌర్యమాన్ నిజంగా నేరం చేశాడా? లేక అతనిపై కుట్ర జరిగిందా? తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో అర్జున్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు? అనే ప్రశ్నలకు ట్రైలర్ సమాధానం ఇవ్వకుండా సస్పెన్స్‌ను కొనసాగించింది. దాదాపు రెండున్నర నిమిషాల ట్రైలర్ చివరి వరకు ఉత్కంఠను నిలబెడుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
Also Read
- Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
- Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
- Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
- Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
ఈ చిత్రంలో టిల్లోటమా షోమ్, దియా మీర్జా, సంజీదా షేక్, ఆకాంక్ష రంజన్ కీలక పాత్రలు పోషించారు. కోర్ట్‌రూమ్ డ్రామాతో పాటు సెంటిమెంట్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. అయితే ‘ఇక్కా’ థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రం 2026 జూలై 10 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. కోర్ట్‌రూమ్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులతో పాటు, సన్నీ డియోల్, అక్షయ్ ఖన్నా కాంబినేషన్‌ను మళ్లీ చూడాలనుకునే అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Ikka Trailer: 30 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి.. సన్నీ, అక్షయ్ కోర్ట్‌రూమ్ వార్ అదిరింది
-
Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
-
India External Debt 2026: 762.8 బిలియన్ డాలర్లకు పెరిగిన భారత విదేశీ రుణం..
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్‌కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!