NTV Telugu Site icon

Nagarjuna: సెలబ్రిటీలు చనిపోతే నాగార్జున ఎందుకు వెళ్లడం లేదు?

Akkineni Nagarjuna

Akkineni Nagarjuna

Nagarjuna: టాలీవుడ్‌లో ఇటీవల వరుసగా సెలబ్రిటీలు చనిపోతున్నారు. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు.. ఇలా ప్రముఖ నటులు కన్నుమూశారు. దీంతో పరిశ్రమ మొత్తం వీరికి నివాళులు అర్పించింది. చాలా మంది స్టార్ నటులు స్వయంగా వాళ్ల ఇళ్లకు వెళ్లి భౌతికకాయానికి నివాళులు అర్పించడం చూశాం. అయితే అక్కినేని నాగార్జున మాత్రం ఇటీవల ఎవరూ చనిపోయినా చివరి చూపు చూసేందుకు వెళ్లడం లేదు. ఒకట్రెండు సందర్భాలలో ఆయన షూటింగ్‌లలో ఇతర దేశాలలో ఉన్నారని అభిమానులు సర్దిచెప్పారు. అయితే అది అసలు కారణమే కాదని తెలుస్తోంది. దీంతో ఆయన అందుబాటులోనే ఉన్నా ఇలా ఎందుకు చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Read Also: Drinking Alcohol: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఆల్కహాల్ తాగేవాళ్లకు అమ్మాయిలను ఇవ్వకండి

ప్రస్తుతం ఈ విషయం గురించే అటు సినీ ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ చర్చ జోరుగా సాగుతోంది. నాగార్జున కుటుంబంలో అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూసినా.. ఆయన సతీమణి అన్నపూర్ణమ్మ కన్ను మూసినా చాలా మంది ప్రముఖులతో పాటు వందల్లో, వేలల్లో స్వయంగా వెళ్లి సంతాపం ప్రకటించారు. కానీ నాగార్జున ఎవరు కన్ను మూసినా ఆఖరి చూపుకు వెళ్లడం లేదనే విషయం పెద్ద ప్రశ్నగానే ఉంది. పెళ్లిళ్లు, ఇతర పార్టీలకు హాజరయ్యే నాగార్జున ఇలా సెలబ్రిటీలు చనిపోతే చివరిచూపు చూసేందుకు ఎందుకు రావడం లేదో ఆయనే నోరువిప్పి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మూడు, నాలుగు రోజుల తర్వాత నాగార్జున మృతుల ఇళ్లకు వెళ్లి కుటుంబీకులను పరామర్శించిన సందర్భాలు ఉన్నాయి తప్పితే పార్ధివ దేహాలకు నివాళులు మాత్రం అర్పించడం లేదు. నాగార్జున సంగతి పక్కన పెడితే ఆయన కుమారులు నాగ చైతన్య, అఖిల్ మాత్రం చావు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూస్తే చైతూ వెళ్లి ఆఖరి చూపు చూసి మహేష్ బాబును ఓదార్చాడు. అఖిల్ కూడా ఇలాంటి కార్యక్రమాలకు హాజరవుతూ మీడియా కంట కనిపిస్తున్నాడు.