NTV Telugu Site icon

Brook Shields: రేప్ కు గురైన ‘బ్లూ లాగూన్’ భామ!

Brook Shields

Brook Shields

బ్రూక్ షీల్డ్స్ అన్న పేరు దాదాపు నలభై ఐదు సంవత్సరాల క్రితం కుర్రకారు గుండెల్లో వీణలు మోగించింది. నిజానికి అప్పటికి బ్రూక్ వయసు 12 సంవత్సరాలే. అయినప్పటికీ చిన్నవయసులోనే బ్రూక్ షీల్డ్స్ నగ్న చిత్రాలు హల్ చల్ చేశాయి. అందరూ ఆమెను “ప్రెట్టీ బేబీ” అంటూ పిలిచేవారు. కొందరు “చైల్డ్ సెక్స్ మోడల్” అంటూ కీర్తించారు. ఇక 1980లో బ్రూక్ షీల్డ్స్ నటించిన “బ్లూ లాగూన్” సినిమా జనం ముందుకు రాగానే ఎందరికో శృంగారరసాధిదేవతగా మారింది. 15 ఏళ్ళ వయసులోనే బ్రూక్ షీల్డ్స్ నాజూకు షోకులు చూసి ఎంతోమంది ముసలి రసికులు సైతం ఫిదా అయిపోయారు. ఆ తరువాత మీడియా బ్రూక్ షీల్డ్స్ ను “ఐకానిక్ అమెరికన్ బ్యూటీ, ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్, సెక్సువలైజ్డ్ చైల్డ్ మోడల్, ద మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ ఉమన్ ఇన్ ద వరల్డ్” అంటూ కీర్తించింది. ప్రస్తుతం బ్రూక్ షీల్డ్స్ వయసు 57 సంవత్సరాలు. ఈ వయసులోనూ బికినీలో మురిపిస్తోంది బ్రూక్. తాజాగా తనకున్న “ప్రెట్టీ బేబీ” టైటిల్ తోనే ఓ డాక్యుమెంటరీ రూపొందించింది.

ఈ డాక్యుమెంటరీలో తన భర్త డైరెక్టర్ క్రిష్ హెంచీ, 19 ఏళ్ళ పెద్ద కూతురు రోవన్, 16 ఏళ్ళ చిన్న కూతురు గ్రియర్ కూడా కనిపిస్తారనీ చెబుతోంది బ్రూక్ షీల్డ్స్. ఆమెలాంటి అందాలతార నటించిన డాక్యుమెంటరీకి కూడా క్రేజ్ ఉంటుందని చెప్పక్కర్లేదు. అయితే ఈ డాక్యుమెంటరీలో ఎలా తాను 11 ఏళ్ళ వయసులోనే రేప్ కు గురయింది వివరిస్తోందట! అప్పుడు తాను ఎంతగా ఏడ్చింది, ఎలా ఆ సంఘటన మరచిపోవడానికి సతమతమయింది అన్నీ చెప్పబోతోందట! ఇప్పటికీ ఎంతోమంది అమ్మాయిలను బాల్యంలోనే చిదిమేస్తున్న నీచులు ఉన్నారని, అలాంటి వారి నుండి తమను తాము రక్షించుకోవడానికి, ఒకవేళ ఇప్పటికే బలై పోయినవారు తమ ప్రతిభతో కోరుకున్న రంగంలో రాణించడానికీ తన డాక్యుమెంటరీ స్ఫూర్తినిస్తుందని బ్రూక్ షీల్డ్స్ అంటున్నారు. తాను 11 ఏళ్ళ ప్రాయంలో లైంగిక దాడికి గురైనా, తన 22వ సంవత్సరం దాకా ‘కన్యత్వం’ కోల్పోలేదని బ్రూక్ షీల్డ్స్ అంటోంది! అయితే ఈ డాక్యుమెంటరీ చూసి తీరవలసిందే అంటున్నారు బ్రూక్ ఫ్యాన్స్.