NTV Telugu Site icon

Allu Arjun: అట్లీని కలిసిన అల్లు అర్జున్… ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యినట్లేనా?

Allu Arjun

Allu Arjun

సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ఇండియన్ సినిమా కింగ్ షారుఖ్ ఖాన్ తో కలిసి ‘జవాన్’ సినిమా చేసాడు. సౌత్ లో అపజయమెరుగని అతితక్కువ మంది దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న అట్లీ, నార్త్ లో డెబ్యూ సినిమాతోనే సంచనలం సృష్టించాడు. బాలీవుడ్ లో హేమాహేమీ దర్శకుల వల్ల కూడా కానీ వెయ్యి కోట్ల బెంచ్ మార్క్ ని రెండు వారాల్లో చేరుకునే రేంజ్ సినిమాని నార్త్ ఆడియన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు అట్లీ. జవాన్ సినిమాలో షారుఖ్ హీరో మాత్రమే… సినిమా మొత్తం సౌత్ స్టైల్ లోనే ఉంటుంది. అందుకే నార్త్ ఆడియన్స్ కి కొత్తగా అనిపించి, జవాన్ సినిమాని రిపీట్ మోడ్ లో చూస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పటి నుంచీ అల్లు అర్జున్ క్యామియో ప్లే చేస్తాడు అనే రూమర్ వినిపిస్తూ ఉంది. ఇండస్ట్రీ వర్గాలు, మీడియా కూడా అల్లు అర్జున్ జవాన్ సినిమాలో క్యామియో ప్లే చేస్తున్నాడనే వార్త తెగ వైరల్ చేసారు.

లాస్ట్ కి అల్లు అర్జున్ క్యామియో కాదు కదా కనీసం పేరు కూడా జవాన్ సినిమాలో వినిపించలేదు. దీంతో ఇదంతా జస్ట్ ఒక రూమర్ మాత్రమే అని కొట్టి పారేసారు. డైరెక్టర్ అట్లీ మాత్రం అల్లు అర్జున్ తో సినిమా చేస్తాను అంటూ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ బన్నీ ఫ్యాన్స్ ని ఊరిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ కి, అట్లీ ఉన్న ఫామ్ లో ఈ ఇద్దరూ కలిస్తే పాన్ ఇండియా రేంజులో ఒక సెన్సేషనల్ సినిమా రావడం గ్యారెంటీ. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఈ రూమర్ ని నిజం చేసే పనిలో ఉన్నారు అల్లు అర్జున్-అట్లీ. ఇటీవలే అల్లు అర్జున్ వెళ్లి అట్లీని కలిసి వచ్చాడని సమాచారం. సినిమా గురించి, డేట్స్ అడ్జస్ట్మెంట్ గురించి డిస్కషన్ జరిగిందని కోలీవుడ్ మీడియా చెప్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసలు బన్నీకి ఉన్న టైట్ షెడ్యూల్ లో అట్లీతో సినిమా చేయడం అనేది జరుగుతుందా లేదా చూడాలి.

Show comments