NTV Telugu Site icon

Allu Arjun: సినిమాల్లో మాత్రమే మాస్… లోపల ఒరిజినల్ అలానే ఉంది…

Allu Arjun

Allu Arjun

అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఫుల్ మాస్ గా కనిపించాడు. లాంగ్ హెయిర్ తో రగ్గడ్ లుక్ లో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసాడు. సినిమాలో మైత్రమే క్యారెక్టర్ కి తగ్గట్లు మాస్ గా కనిపించడం, రగ్గడ్ గా కనిపించడం అల్లు అర్జున్ కి అలవాటైన పని. ఏ క్యారెక్టర్ ఏం కోరుకుంటుందో అలా ఛేంజోవర్ చూపించడంలో అల్లు అర్జున్ దిట్ట. అందుకే బన్నీ సినిమా సినిమాకి కొత్తగా కనిపిస్తూ ఉంటాడు. అయితే సినిమాల వరకూ మాత్రమే మాస్ లుక్ లో కనిపించే అల్లు అర్జున్, బయట మాత్రం స్టైల్ కి కేరాఫ్ అడ్రెస్ లా ఉంటాడు. బయటకి వస్తే చాలు తన డెస్సింగ్ అండ్ మైంటైనెన్స్ తోనే అల్లు అర్జున్ కిక్ ఇస్తాడు. అందుకే బన్నీ ఆఫ్ లైన్ ఫొటోస్ కి క్రేజ్ ఎక్కువ. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్, లేటెస్ట్ గా సూటు వేసుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పుష్పరాజ్ లుక్ కి, లేటెస్ట్ ఫోటో లుక్ కి డిఫరెన్స్ చూస్తే అల్లు అర్జున్ చూపించే వేరియేషన్ కి ఫిదా అవ్వాల్సిందే. ఇదిలా ఉంటే మంచి సినిమా ఎప్పుడు వచ్చినా సపోర్ట్ చేసే అల్లు అర్జున్ లేటెస్ట్ గా ‘బేబీ’ సినిమాకి అండగా నిలుస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బేబీ సినిమాని చూసిన అల్లు అర్జున్, గంట సేపు చిత్ర యూనిట్ తో మాట్లాడి అభినందించాడు. బేబీ చిత్ర యూనిట్ ని అభినందించడానికి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి అప్రిసియేషన్ మీట్ పెట్టారు. అల్లు అర్జున్ గతంలో కలర్ ఫోటో సినిమాకి కూడా ఇలానే సపోర్ట్ చేసాడు. ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆర్టిస్టులు అందరూ తనకి బాగా క్లోజ్ అయిన వాళ్లు కాబట్టి అల్లు అర్జున్ మరింత పుష్ ఇవ్వడానికి రంగంలోకి దిగినట్లు ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్ అయ్యి, ఒక భారీ బడ్జట్ సినిమా షూటింగ్ లో బిజీ ఉండి కూడా అల్లు అర్జున్ ఇలా బేబీ సినిమాకి అండగా నిలవడం గొప్ప విషయమే.

Show comments