NTV Telugu Site icon

IBomma: చెప్పేవి శ్రీరంగనీతులు.. దూరేవి.. ? అన్నట్టు.. నీకెందుకయ్యా ఈ సుద్దపూస కబుర్లు

Ibomma Note

Ibomma Note

IBomma Releases a Note Regarding Theatrical Prints of Kushi and Jailer: ఐ బొమ్మ అనే ఒక వెజ్ సైట్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అంటే ఓటీటీల్లో రిలీజ్ అయ్యే అన్ని తెలుగు సినిమాలు, వెబ్ సిరీసులను ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగా చూసే లాగా ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ వచ్చేవారు. అయితే కొద్ది రోజుల క్రితం జైలర్ సినిమా థియేటర్ ప్రింట్ తో పాటు ఖుషి సినిమా థియేటర్ ప్రింట్ కూడా ఐ బొమ్మ వెబ్సైట్ లో ప్రత్యక్షం కావడం అందరికీ షాక్ కలిగించింది. ఎందుకంటే కేవలం డిజిటల్ రిలీజ్ అయిన సినిమాలను వెబ్ సిరీస్ లను మాత్రమే ముందు ఐ బొమ్మ రిలీజ్ చేస్తూ ఉండేది. దానివల్ల ఓటిటి ప్లాట్ ఫామ్స్ కి నష్టం కానీ సినీ పరిశ్రమకు పెద్దగా నష్టం వాటిల్ల లేదు. కానీ ఇప్పుడు సినిమాలు థియేటర్లలో ఆడుతున్నప్పుడే థియేటర్ ప్రింట్ రిలీజ్ చేయడం సినీ వర్గాల వారికి ఆగ్రహం తెప్పించింది.

Krithi Shetty: సారీ లుక్ తో మతిపోగొడుతున్న.. కృతి శెట్టి

అయితే ఇదే విషయం మీద సినీ పరిశ్రమ మొత్తానికి ఐ బొమ్మ వార్నింగ్ ఇచ్చినట్టు కొన్ని ఫేక్ స్క్రీన్ షాట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ తతంగం అంతా చూసిన ఐ బొమ్మ ఇప్పుడు తన వెబ్సైట్లో ఒక నోట్ ప్రచురించింది. పూర్తిగా ఇంగ్లీషులో ఉన్న ఆ నోట్ సారాంశం ఏమిటంటే తమ పేరు మీద కొంతమంది వ్యక్తులు థియేట్రికల్ ప్రింట్ సినిమాలను రిలీజ్ చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకు కూడా అలా చేయడం చాలా దురదృష్టకరమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ సినీ పరిశ్రమకు సపోర్ట్ చేసి ఇలాంటి పనులను తిప్పి కొట్టాలని అందులో పేర్కొన్నారు. ఇండియాలో ఇలాంటి థియేట్రికల్ ప్రింట్ తాము అందుబాటులోకి తీసుకురాలేదని, అలాంటి ఫేక్ ఐబొమ్మ వెబ్సైట్స్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.

అంతేకాక భారతదేశంలో ఉన్న సంబంధిత అధికారులు ఇలా థియేట్రికల్ ప్రింట్ లీకేజ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అంతేకాక ఒక రకమైన సామెత చెబుతూ పళ్ళు ఇచ్చే చెట్టు నుండి పళ్ళు మాత్రమే తీసుకోవాలి కానీ చెట్టు మొత్తాన్ని నరికి అన్ని పళ్ళు తీసుకోవాలని అనుకుంటే భవిష్యత్తులో పళ్ళు తీసుకునే అవకాశం లేకుండా పోతుంది అంటూ వేదాంతం చెప్పుకొచ్చారు. తమకు వేరే ఎలాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ లేవని చెబుతూ ఈ మేరకు ఐబొమ్మ ఒక క్లారిటీ రిలీజ్ చేసింది. అయితే ఐ బొమ్మ చేసేదే ఒక ఫ్రాడ్ పని మళ్ళీ దానికి ఇలా నీతులు చెబుతూ నోట్ షేర్ చేయాలా అంటూ సోషల్ మీడియా నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారం మీద మాత్రం ఐబొమ్మ సైలెన్స్ పాటించింది.