Site icon NTV Telugu

Ibomma Ravi: పెద్ద ప్లానింగే.. భవిష్యత్ ప్రణాళికలను పోలీసులకు చెప్పిన ఐబొమ్మ రవి!

Ibomma Ravi

Ibomma Ravi

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఐబొమ్మ’ పైరసీ సైట్‌ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు ముందు ఇమంది రవి తన భవిష్యత్ ప్రణాళికలను వివరించాడు. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ పెడుతున్నట్లు విచారణలో రవి చెప్పాడు. ఐబొమ్మ ద్వారా వచ్చిన సంపాదనలో రూ.17 కోట్లు ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేశానని, ఐబొమ్మ డబ్బుతోనే 86 దేశాలను చుట్టి వచ్చానని షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

Also Read: Chitrapuri Colony Scam: చిత్రపురి కాలనీ అక్రమాల కేసు.. ఫైనల్ రిపోర్టులో పలువురు సినీ పెద్దల పేర్లు!

నీ ఐబొమ్మ కథ ముగిసింది, తర్వాత ఏంటి నీ ప్లాన్? అని పోలీసులు ప్రశ్నించగా.. ఇమంది రవి తన భవిష్యత్ ప్రణాళికలను వివరించాడు. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ పేరుతోనే ఒక రెస్టారెంట్ ప్రారంభించి.. భారతీయ వంటకాలను అక్కడి ప్రజలకు పరిచయం చేస్తానని చెప్పాడు. కరేబియన్‌లోని అన్ని దేశాల్లో రెస్టారెంట్ బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తానని విచారణలో వెల్లడించాడు. ఐబొమ్మతో సంపాదించిన డబ్బుతో ఉల్లాసంగా గడపడమే తన లక్ష్యమని రవి చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే రెండుసార్లు కస్టడీకి తీసుకొని ఐబొమ్మ రవిని పోలీసులు విచారించారు. పోలీసులు ఇప్పటికే రవికి సంబంధించి రూ.3 కోట్లతో పాటు ఆస్తులను సీజ్ చేశారు.

Exit mobile version