రాజ్ కుమార్ హిరాణీ… ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్ అనే లిస్ట్ తీస్తే తప్పకుండా టాప్ 5 లో ఉంటాడు. సక్సస్ ఫెయిల్యూర్ అనే బాక్సాఫీస్ లెక్కల్ని పక్కన పెట్టేస్తే రాజ్ కుమార్ హిరాణీ సినిమాల్లో హానెస్టీ ఉంటుంది. ఒక కథని చాలా సరదాగానే చెప్తూ అండర్ కరెంట్ గా బ్యూటుఫుల్ ఎమోషన్ ని చెప్పడం హిరాణీకి మాత్రమే చెల్లిన స్టోరీ టెల్లింగ్. సోషల్ మెసేజ్, ఫన్, ఎమోషన్… ఈ మూడు ఎలిమెంట్స్ ని మిస్ చేయకుండా గొప్పగా కథలని చెప్తూ సినిమాలు చేసే రాజ్ కుమార్ హిరాణీ ఇటీవలే డంకీ సినిమాతో నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసాడు. బిజినెస్ పరంగా చూసుకుంటే డంకీ సినిమాని అమ్మిన దానికంటే ఎక్కువే రాబట్టిన కానీ షారుఖ్ స్థాయి సినిమా కాదు. ఈ మాట దగ్గరే అసలు సమస్య మొదలవుతుంది. 2023లో అప్పటికే రెండు మాస్ సినిమాలు చేసి హిట్స్ కొట్టిన షారుఖ్ నుంచి సడన్ గా జానర్ షిఫ్టింగ్ ని ఆడియన్స్ ఒప్పుకోలేకపోయారు.
షారుఖ్ తో కాకుండా వేరే ఎవరితో డంకీ సినిమా చేసినా రాజ్ కుమార్ హిరాణీ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే వాడు. అంతటి క్రెడిబిలిటీ సొంతం చేసుకున్న రాజ్ కుమార్ హిరాణీతో సినిమా చేయాలని బాలీవుడ్ మొత్తం కళలు కంటూ ఉంటుంది. అలాంటిది రాజ్ కుమార్ హిరాణీ మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఉందని చెప్తున్నాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో హిరాణీ మాట్లాడుతూ… ఆర్ ఆర్ ఆర్ సినిమా చూసాను రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. రామ్ చరణ్ తేజ్ తో సినిమా చేయాలని ఉంది కానీ ఇమ్మిడియట్ గా అలాంటి ప్లాన్స్ అయితే ఏమీ లేదు బట్ చేసే ఆలోచన ఉందని చెప్పాడు. ఇది ఎప్పుడు నిజమవుతుందో ఏమో కానీ హిరాణీ-చరణ్ కలిస్తే ఒక క్లాసిక్ సినిమా బయటకి వస్తుంది అనే నమ్మకం అయితే ఉంది. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.