NTV Telugu Site icon

Hyper Aadi: తెలుగు సినిమాను బ్రతికించండి…రివ్యూలపై హైపర్ ఆది కీలక వ్యాఖ్యలు!

Hyper Aadi Speech

Hyper Aadi Speech

Hyper Aadi Crucial Comments on Reviewers at Hyper aadi Speech: హైపర్ ఆది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమాలో విశ్వక్సేన్ అనే ఒక 28 ఏళ్ల కుర్రాడు రత్న అనే పేరుతో ధియేటర్లో చేయబోయే మాస్ జాతరని మీ అందరూ రేపు 31వ తేదీ థియేటర్లో చూడబోతున్నారు. మాములు విషయం కాదు. విశ్వక్సేన్ అనే అతను సినిమాలు చేస్తే ఒకటి పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి, లేకపోతే లాభాలు వస్తాయి. కానీ నష్టాలు మాత్రం రావు. అలాంటి పర్ఫార్మర్ అతను. 24 ఫ్రేమ్స్ మీద పట్టు ఉన్న వ్యక్తి విశ్వక్సేన్ గారు. అలాంటి వ్యక్తికి ఈ సినిమా పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. తన మైండ్ లో గుర్తొచ్చిన డైలాగ్ ని మీ మైండ్ లో గుర్తుండి పోయేలా రాసే రైటర్ కం డైరెక్టర్ మన కృష్ణ చైతన్య గారు. మనందరికీ త్రివిక్రమ్ గారంటే చాలా ఇష్టం ఆ త్రివిక్రమ్ గారికి ఈ కృష్ణ చైతన్య అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ సినిమాలో కుప్పలు తెప్పలుగా డైలాగులున్నాయి. మీరు అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు.

Hyper Aadi: నందమూరి, కొణిదెల సింహాలు అసెంబ్లీలో అడుగుపెడితే వచ్చే కిక్కు మా సినిమా కూడా ఇస్తుంది!

తర్వాత అంజలీ గారు మిమ్మల్ని సీత అనే ఒక క్యారెక్టర్ తో మై మరిచిపోయేలా చేశారు. గీతాంజలి అనే ఒక క్యారెక్టర్ తో భయపెట్టేలా చేశారు. ఈరోజు రత్నమాల అనే క్యారెక్టర్ తో ఆ రెండు క్యారెక్టర్ లను మరిచిపోయేలా చేయబోతోంది. నేహా శెట్టి డీజే టిల్లునే భయపెట్టిన రాధిక ఈ సినిమాలో రత్నాకి భయపడబోతున్న బుజ్జి లాగా తనని చూడబోతున్నారు. రాధికని మర్చిపోతారు బుజ్జిని గుర్తు పెట్టుకుంటారు ఖచ్చితంగా చెబుతున్నాను ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో. ఒక హీరోని అభిమానిస్తే ఇంకో హీరోకి వ్యతిరేకం ఏమో అనుకునే వాళ్ళందరికీ చెబుతున్నాను. మాకు తెలుగు సినిమా అంటే పిచ్చి, తెలుగు హీరోలంటే పిచ్చి. అందర్నీ అభిమానిస్తాం, అందరినీ గౌరవిస్తాం తెలుగు సినిమా బాగుంటే అందరం బాగుంటామని భావిస్తాం. అలాంటిది ఈరోజు మీ అందరూ కూడా ఈ సినిమాకి వచ్చి మా సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు.

అలాగే ఈ మధ్య ధియేటర్లకు జనాలు రావడం కొంచెం తగ్గింది. అందరూ కూడా ఎవరైతే ప్రేక్షకులకు సోషల్ మీడియాలో ఉన్న రివ్యూవర్స్ కి మీ అందరికీ కూడా తెలుగు సినిమాని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాతలని దృష్టిలో పెట్టుకుని రివ్యూ రాయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా పోతే ఇంకో సినిమా చేయడానికి హీరో అనేవాడు మనోధైర్యం తెచ్చుకుంటే చాలు కానీ ప్రొడ్యూసర్ అనేవాడు మనోధైర్యంతో పాటు మనీ కూడా తెచ్చుకోవాలి కాబట్టి. ఆయన గురించి ఆలోచించి ఈసారి రివ్యూలన్నీ రాయాలని తెలుగు సినిమాను బ్రతికించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సింహం ఆ టైముకి మిగిలి ఉన్న జంతువులన్నింటినీ వేటాడేస్తది, బాలకృష్ణ గారు ఆ టైంకి ఉన్న రికార్డులన్నింటినీ వేటాడేస్తూ ఉంటారు అది బాలకృష్ణ గారు. జై తెలుగు సినిమా అంటూ ముగించారు.