Hyderabad Voting Percentage is very Less in Telangana Elections 2023: ఈ రోజు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ట్రెండింగ్ టాపిక్. టాలీవుడ్ స్టార్లు కూడా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు. ఏది ఏమైనప్పటికీ, హైదరాబాదు కంటే గ్రామీణ ప్రాంతాలన్నింటికీ అధిక ఓటింగ్ నమోదవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మునుపెన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో పోలింగ్ శాతం చాలా నిరాశపరిచింది. హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంది, మధ్యాహ్నం 3 గంటల నాటికి కేవలం 31% మాత్రమే నమోదవగా మొత్తం లెక్కేసినా 40 శాతం దాటని పరిస్థితి కనిపిస్తోంది. ఈ దెబ్బతో హైదరాబాద్ వాసులు కేవలం సినిమాలు, ఫుడ్, షాపింగ్ మాల్ లాంచ్‌లపైనే ఆసక్తి చూపుతున్నారని నెటిజన్లు హైదరాబాదీలను ట్రోల్ చేయడం ప్రారంభించారు.
World AIDS Day 2023: మీరు కూడా హెచ్‌ఐవీ, ఎయిడ్స్ ఒకటే అని అనుకుంటున్నారా?.. తేడా తెలుసుకోండి..
హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభించిన లులు మాల్‌కు అనూహ్యమైన జనం రావడంతో కొద్దిరోజులుగా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై హైదరాబాదీ ఓటర్లకు ఆసక్తి లేకపోవడంతో నెటిజన్లు అవహేళన చేస్తున్నారు. కొత్త సినిమా విడుదలైనప్పుడల్లా, ఫుడ్‌స్టాల్ లేదా షాపింగ్ మాల్ ఓపెన్ అయినప్పుడల్లా హైదరాబాదీలు ఆసక్తి కనబరుస్తారు కానీ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినప్పటికీ ప్రజలు ఓటు వేసేందుకు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదని అంటున్నారు. ఇక ఆసక్తికరంగా, హైదరాబాద్‌లో యానిమల్ షోల బుకింగ్ దాదాపు 70% అయితే ఓటింగ్ శాతం కేవలం 40 % మాత్రమే. నిజానికి హైదరాబాద్ వంటి సిటీల్లో రాను రాను పోలింగ్ తగ్గుతోంది. ప్రభుత్వం పెయిడ్ హాలిడేగా ప్రకటిస్తోంది. ప్రైవేటు సంస్థలు కూడా దీన్ని అమలు చేస్తాయి. అయినా ఓటు వేయడానికి బద్దకిస్తున్నారు. హాలిడేస్ వచ్చాయని సొంత పనులు చేసుకుంటున్నారు. ఓటు ప్రాధాన్యత గుర్తించలేకపోతున్నారు. సెలవు ఇచ్చి మరీ ఓటు వేయమంటే.. ప్రజలు వేయడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నగర ఓటర్లు తీరు ప్రతిసారీ చర్చనీయాంశంగా మారుతోంది.